Devara Hyderabad Bookings: 'దేవర' అడ్వాన్స్ బుకింగ్స్ - సుదర్శన్, ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఆల్ షోస్ హౌస్‌ఫుల్, అదీ క్షణాల్లో!
Devara Movie Tickets Hyderabad: 'దేవర' సినిమా టికెట్ బుకింగ్స్ తెలంగాణలో ఓపెన్ అయ్యాయి. హైదరాబాద్ సిటీలోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఫస్ట్ డే అన్ని షోస్ క్షణాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి.
'దేవర' (Devara Movie) చూడడానికి ప్రేక్షకులు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఎంత ఆసక్తిగా ఉన్నారు? టికెట్స్ కోసం, బుక్ మై షో అండ్ పేటీఎంలలో అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు? అనేది చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. హైదరాబాద్ సిటీలోని ఓ మల్టీప్లెక్స్, ఓ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓపెనింగ్ డే టికెట్స్ ఇలా ఓపెన్ చేశాయో? లేదో? అలా హౌస్ ఫుల్ అయిపోయాయి. ఆ వివరాల్లోకి వెళితే...
ప్రసాద్ మల్టీప్లెక్స్... సుదర్శన్... రెండు హౌస్ ఫుల్!
Devara bookings open now in Hyderabad: తెలంగాణ ప్రభుత్వం నుంచి బెనిఫిట్ షోలు, ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ మీద అదనంగా కొంత పెంచుకోవడానికి అనుమతి వచ్చిన వెంటనే హైదరాబాద్ సిటీలో 'దేవర' అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్న ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ప్రస్తుతానికి ఒక్క స్క్రీన్ టికెట్స్ ఓపెన్ చేసింది.
ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు షోస్ షెడ్యూల్ చేసింది. కొన్ని క్షణాలలోనే ఆ ఐదు ఆటలకు సంబంధించిన టికెట్స్ అన్నీ అమ్ముడు అయ్యాయి. బుక్ మై షో ఓపెన్ చేస్తే హౌస్ ఫుల్ అని కనబడుతోంది.
#Devara - Hyderabad bookings OPEN NOW https://t.co/VmRtrXvpWe
— .... (@ynakg2) September 23, 2024
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సముదాయంలో గల సుదర్శన్ థియేటర్లో పరిస్థితి కూడా అంతే. మొదటి రోజు ఏడు ఆటలకు సంబంధించిన టికెట్స్ ఓపెన్ చేశారు. ఇలా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో లేదో... అంతే స్పీడుగా అన్ని అమ్ముడు అయిపోయాయి. దాంతో ఆ థియేటర్ వరకు కూడా హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
Also Read: ఎన్టీఆర్‌లో ఆలియా భట్‌కు నచ్చే విషయం ఎంటో తెలుసా? - బాలీవుడ్ బ్యూటీని టెన్షన్ పెట్టిన తారక్
ప్రసాద్స్ మల్టీప్లెక్స్ టికెట్ రేట్ 413 రూపాయలు కాగా... సింగిల్ స్క్రీన్ సుదర్శన్ టికెట్ రేటు 295 రూపాయలు. అది బాల్కనీ రేటు. లోయర్ క్లాస్ రేటు అయితే 150 రూపాయలు. మిగతా థియేటర్లలో ఎప్పుడు టికెట్స్ ఓపెన్ చేస్తారని పలువురు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బెనిఫిట్ షోల కోసం వెయిట్ చేస్తున్న డై హార్డ్ ఫ్యాన్స్!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 29 థియేటర్లలో మిడ్ నైట్ ఒంటిగంటకు బెనిఫిట్ షో వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో 20 థియేటర్లు హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. ఆ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని ఎన్టీఆర్ డైహార్డ్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. మిగతా 9 థియేటర్లలో ఖమ్మంలో ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే... ఓపెనింగ్ డే కలెక్షన్లలో దేవర రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. మరి మొదటి రోజు ట్రిపులర్ రికార్డ్ బ్రేక్ అవుతుందా లేదా అనేది చూడాలి.
Also Read: ఏపీ కంటే తక్కువ కానీ... తెలంగాణలో 'దేవర' టికెట్ రేట్లు ఎంత పెరిగాయో తెలుసా?