DEVARA X JIGRA Interview Promo: ఎన్టీఆర్‌లో ఆలియా భట్‌కు నచ్చే విషయం ఎంటో తెలుసా? - బాలీవుడ్ బ్యూటీని టెన్షన్ పెట్టిన తారక్
NTR and Alia Bhatt Interview: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్... ఇద్దర్నీ కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మధ్య మంచి స్నేహం ఉంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'లో వీళ్ళిద్దరూ నటించారు. ఇప్పుడు మరోసారి ఈ టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా దేవర విడుదల సందర్భంగా ఆయనతో పాటు ఆలియాను ఇంటర్వ్యూ చేశారు కరణ్ జోహార్.
ఎన్టీఆర్... అతనిలో నచ్చేది అదే!
స్నేహితుడిగా కాకుండా నటుడిగా ఎన్టీఆర్ (Jr NTR)లో నచ్చే విషయం ఏమిటి? అని అడిగినప్పుడు... ''అతను ఏ విధమైన పెర్ఫార్మన్స్ ఇస్తాడు అనేది అసలు ఊహించలేం. నాకు అది చాలా ఇష్టం. ఎన్టీఆర్ నటనతో నేను ప్రేమలో పడతాను'' అని అలియా భట్ తెలిపింది.
ఆలియాను టెన్షన్ పెట్టిన ఎన్టీఆర్!
ఎన్టీఆర్ విషయానికి వస్తే... ఒక్క విషయంలో ఆలియాను టెన్షన్ పెట్టారు. 'జిగ్రా' సినిమాకు తెలుగులో అలియా భట్ డబ్బింగ్ చెప్పాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ ఆ మాట అన్నారో లేదో... తన గోళ్లు కొరకడం మొదలు పెట్టింది బాలీవుడ్ బ్యూటీ. 'ఆర్ఆర్ఆర్' కోసం అలియా భట్ తెలుగులో కొంత శిక్షణ తీసుకుంది. అయితే డబ్బింగ్ చెప్పే అంత పర్ఫెక్ట్ కాలేదు అందుకని ఆవిడ కాస్త టెన్షన్ పడింది.
భయం ఉండాలి... అది మంచిది!
కరణ్ జోహార్, అలియాతో మాట్లాడుతూ ప్రతి మనిషికి కొంత భయం ఉండాలని అది చాలా మంచిదని ఎన్టీఆర్ చెప్పారు. 'దేవర'లో భయం అనేది ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలలో... ప్రతి మనిషికి బతికేంత ధైర్యం ఉండే చాలని, ఎదుట వ్యక్తిని చంపేంత ధైర్యం అవసరం లేదని, ఒకవేళ ఆ ధైర్యం పెరిగితే దాన్ని తగ్గించే భయాన్ని అవుతానని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ పాపులర్ అవుతోంది. ఎన్టీఆర్, ఆలియాలో ఒక కామన్ క్వాలిటీ ఉందని చెబుతూ... రేపు (మంగళవారం, సెప్టెంబర్ 24న) విడుదల అయ్యే ఫుల్ ఇంటర్వ్యూ మీద ఇంట్రెస్ట్ పెంచేశారు కరణ్ జోహార్.
Also Read: ఏపీ కంటే తక్కువ కానీ... తెలంగాణలో 'దేవర' టికెట్ రేట్లు ఎంత పెరిగాయో తెలుసా?
An ultimate fun pataka – #DevaraKaJigra Interview Promo is here! ❤️https://t.co/BjlirYE7BG
— NTR Arts (@NTRArtsOfficial) September 23, 2024
Double the entertainment awaits tomorrow! ✨#Devara #Jigra#DevaraOnSep27th
Man of Masses @Tarak9999 @Aliaa08 #KaranJohar @ntrartsofficial @yuvasudhaarts @dharmamovies @tseires… pic.twitter.com/0L1KdFrPqn
దసరా బరిలో ఆలియా భట్ 'జిగ్రా'
ఎన్టీఆర్, అలియా కలిసి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం ఇద్దరి సినిమాలో రెండు వారాల వ్యవధిలో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి కనుక. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 27న) తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 'దేవర' ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన రెండు వారాలకు... విజయదశమి సందర్భంగా 'జిగ్రా' విడుదలకు రెడీ అయింది.
Also Read: రాజమౌళి గారూ... మహేష్ బాబుకు ఏ ఆయిల్ పంపించారండీ - మహర్షిని రుషిలా చేసేశారు కదండీ!
ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన 'జిగ్రా' సినిమా ప్రచార చిత్రాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. తమ్ముడిని జైల్లో వేస్తే... అతడిని బయటకు తీసుకురావడం కోసం ఓ అక్క ఎటువంటి పోరాటం చేసింది? అనేది సినిమా కథ. ఈ సినిమా కోసం ఆలియా యాక్షన్ సీక్రెన్సుల్లో కూడా నటించారు. ఒక విధంగా ఆమెకు ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఇది.