Mahesh Babu New Look: రాజమౌళి గారూ... మహేష్ బాబుకు ఏ ఆయిల్ పంపించారండీ - మహర్షిని రుషిలా చేసేశారు కదండీ!
Mahesh Babu Viral Look: సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు లేని కొత్త లుక్ సెన్సేషనల్ అవుతోంది. రాజమౌళి సినిమా కోసమే ఆయన ఈ లుక్ లోకి వచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)... టాలీవుడ్ హీరోలలో అందగాడు, మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. మహేష్ కలర్, మహేష్ గ్లామర్ వల్ల తాము జలసి ఫీలైనట్లు చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారు. అటువంటి అమ్మాయిలు అందరూ ఇప్పుడు మహేష్ హెయిర్ స్టైల్ చూసి ఇంకా జలసి ఫీల్ అవుతారేమో!? ప్రెజెంట్ నెట్టింట ఆయన కొత్త లుక్ వైరల్ అవుతోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహేష్
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి మహేష్ బాబు ఇటీవల 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలకు గాను ఆ మొత్తాన్ని వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ విరాళాన్ని చెక్కు రూపంలో అందజేయడానికి ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు మహేష్. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు వీడియోలలో మహేష్ కొత్త లుక్ వైరల్ అవుతోంది.
న్యూ హెయిర్ స్టైల్ తో సీఎం రేవంత్ ను కలిసిన మహేశ్ బాబు.!#maheshbabu #newlook #Longhair #ssrajamouli #cmrevanthreddy #firstlook #TelanganaFloods pic.twitter.com/7OE7d7S9iY
— ABP Desam (@ABPDesam) September 23, 2024
రాజమౌళి గారూ... ఏ ఆయిల్ పంపించారండీ!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli), మహేష్ బాబు కలిసి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తమ స్పీడుగా జరుగుతున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళతారని కూడా ఫిలిం నగర్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆ సినిమా కోసమే కొన్ని నెలలుగా మహేష్ బాబు ప్రిపేర్ అవుతున్నారు. ఫిజికల్ వర్కౌట్స్ చేయడంతో పాటు మేకోవర్ మీద ఆయన దృష్టి పెట్టారు.
Also Read: ఆస్కార్స్‌కు 'లాపతా లేడీస్' - ప్రభాస్ 'కల్కి', 'యానిమల్'ను కాదని మరీ... అందులో ఏముందో తెలుసా?
రాజమౌళి తన హీరోలకు కొత్త లుక్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అప్పటి వరకు ఆయా హీరోలు చేసిన సినిమాలతో పోల్చి చూసినప్పుడు... దర్శక ధీరుడు సినిమాలో కొత్త లుక్ ఉంటుంది. 'యమదొంగ'లో ఎన్టీఆర్, 'మగధీర - త్రిబుల్ ఆర్' సినిమాల్లో రామ్ చరణ్, 'విక్రమార్కుడు' సినిమాలో రవితేజ... ఇలా ఏ హీరోతో రాజమౌళి సినిమా చేసిన సరే వాళ్ళని కొత్తగా చూపించారు. మహేష్ బాబును సైతం కొత్తగా చూపిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే... మహేష్ బాబు కొన్ని రోజులుగా తన లుక్ రివీల్ కాకుండా చూస్తూ వస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చినప్పుడు గానీ... ఆ తర్వాత విదేశాలకు ఫ్యామిలీతో వెళ్లి వచ్చినప్పుడు గానీ... హెయిర్ స్టైల్ రివీల్ కాకుండా జాగ్రత్తపడ్డారు. క్యాప్ పెట్టుకుని కనిపించారు. అయితే... ఇవాళ రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మహేష్ లుక్ రివిల్ అయింది. పొడవాటి జుట్టు, గడ్డం... ఇంతకు ముందు ఎప్పుడూ ఆయన ఇలా కనిపించలేదు. దాంతో ఈ కొత్త లుక్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ''రాజమౌళి గారు మహేష్ బాబుకు ఏ ఆయిల్ పంపించారండీ... ఆ జుట్టు ఆ గడ్డం అంతలా పెంచడానికి! మహర్షి లో ఉండే మహేష్ బాబును రుషిలా మార్చేశారు'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరొకరు అయితే హాలీవుడ్ హీరో జాన్ విక్ ఫేమ్ కెనూ రీవ్స్‌తో కంపేర్ చేశారు.
మహర్షిలా ఉండే మహేశ్ బాబును... రుషిలా మార్చేసిన రాజమౌళి....!
— Sathish Dandaveni (@UrsDandaveni) September 23, 2024
మహేశ్ గారు...! రాజమౌళిగారు ఏ ఆయిల్ పంపించారండీ...!!
మీ జుట్టు, గడ్డం అంతలా పెంచడానికి....?@ssrajamouli @urstrulyMahesh #SuperstarMaheshbabu #SSMB29 #ssrajamouli pic.twitter.com/hXnFaqvwO8
— 🐋 (@Bhaag_Saale) September 23, 2024
ట్రోల్స్ కూడా వస్తున్నాయి అనుకోండి!
మహేష్ బాబు లుక్కు మీద ప్రశంసలు మాత్రమే కాదు... కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అయితే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... ఇటీవల కాలంలో ప్రతి హీరో మీద పనిగట్టుకుని విమర్శలు చేసే బ్యాచ్ ఒకటి రెడీ అయింది. ఈ ట్రోలింగ్, విమర్శలకు ఎవరు అతీతం కాదు. అందుకని వాటిని పక్కన పెట్టొచ్చు.