Chiranjevi: వర్షంలో కిందపడినా డ్యాన్స్ ఆపలేదు.... మెగా ఛాన్సులకు, ఇప్పుడీ గిన్నిస్ రికార్డుకు ఆ డ్యాన్సే కారణం: చిరు
సెప్టెంబర్ 22న గిన్నిస్ వరల్డ్ రికార్డులో మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ కేటగిరీలో అరుదైన గౌరవం అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి అసలు డ్యాన్స్ చేసే స్కిల్ ఎలా అబ్బిందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో అరుదైన పురస్కారాన్ని పొందిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి సెప్టెంబర్ 22న గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరును పొందుపరచుకున్నారు. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే యాక్టర్, డ్యాన్సర్ కేటగిరీలో ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆయన చేసిన 156 సినిమాల్లో, 537 పాటలు ఉండగా, అందులో 24 వేల డాన్స్ మూవ్స్ ఉన్నాయి. ఇన్నేళ్ల కెరీర్లో ఏ స్టార్ కు సాధ్యం కానీ అత్యద్భుతమైన ప్రతిభతో తెలుగు వారందరూ గర్వపడేలా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు మెగాస్టార్. ఇప్పటికీ అయినను చైనాలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు అంటే చిరు కీర్తి ఎంతగా వ్యాపించిందో చెప్పక్కర్లేదు. 45 వసంతాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు డాన్స్ ల పరంగా గిన్నిస్ బుక్ లో రికార్డును క్రియేట్ చేసుకోవడానికి కారణం డాన్స్ పట్ల ఆయనకు ఉన్న మక్కువే. అసలు ఇదంతా ఎలా మొదలైంది అనే విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నిన్న గిన్నిస్ బుక్ ప్రధానం తర్వాత మాట్లాడుతూ చెప్పారు.
వర్షంలో కిందపడినా డాన్స్ ఆపని మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తను చిన్నప్పటి నుంచే బాగా డాన్స్ లు చేసే వాడిని అదే ఈరోజు ఊహించని విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరుని చేర్చిందని చెప్పుకొచ్చారు. తాను ఎదురు చూడని గౌరవం దక్కినందుకు దేవుడికి, అభిమానులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కు కృతజ్ఞతలు తెలిపిన చిరు నటన కంటే ముందే తనకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేదాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో సాయంత్రం పూట వివిధ భారతి, రేడియో సిలోన్ (శ్రీలంక రేడియో)లలో వచ్చే తెలుగు పాటలకు చుట్టుపక్కల వాళ్లను ఎంటర్టైన్ చేయడానికి డాన్స్ లు చేసే వాడిని అని చెప్పిన చిరు... అప్పట్లో వాటిని అసలు డ్యాన్స్ అంటారా లేక బాడీ కదలిక అంటారా అనే విషయం కూడా తెలియదని, అయినప్పటికీ ఉత్సాహంగా స్టెప్పులు వేసి అందరిని ఆకట్టుకునే వాడినని చెప్పారు. అలాగే ఎన్సిసి క్యాంపులో కూడా సాయంత్రం టైంలో తిన్నాక క్యాంపైర్ వేసుకుని అల్యూమినియం ప్లేట్లను తిరగేసి వాయిస్తూ డాన్సులు చేసే వాడిని అని గుర్తు చేసుకున్నారు. అలా మొత్తానికి సంగీతానికి అనుగుణంగా స్టెప్పులు వేయడం అనేది తన జీవితంలో భాగమైంది అన్న చిరు ఫస్ట్ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు అక్కడ కూడా సరదాగా తన రూమ్ లో డ్యాన్సులు చేసుకునే వాడినని అన్నారు. కోస్టార్స్ అందరూ చిరు చాలా బాగా డాన్స్ చేస్తాడని అందరికీ చెప్పే వారట. అలా ఓ రోజు నరసింహారాజు, కవిత, రోజా రమణి, సావిత్రి వీళ్లంతా ఉండగా, సాయంత్రం పూట రాజమండ్రి పరిసరాల్లో ఓ పల్లెటూరులో షూటింగ్ జరుగుతోందట. చిరు ఆ టైంలో అందరూ పంచ కట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. అయితే లైట్ గా వర్షం పడుతుండడంతో అందరూ కలిసి చిరుని డాన్స్ చేయమని అడిగారట. ఇక అడగడమే ఆలస్యం అన్నట్టుగా డాన్సులు చేసే చిరంజీవి డాన్స్ చేస్తూనే వర్షానికి కాలుజారి కింద పడ్డారట. అయినప్పటికీ ఆపకుండా దాన్ని నాగిని డాన్స్ లా మార్చేసి స్టెప్పులు వేసి అందర్నీ మెప్పించారట. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.
Also Read: కుర్చీలు విరగొట్టిన ఫ్యాన్స్... 'దేవర' ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అయ్యాక రచ్చ రచ్చ
ప్రాణం ప్రాణం ఖరీదులో ఫస్ట్ ఛాన్స్
అయితే చిరు చేసిన ఆ డాన్స్ ని చూసి అక్కడే ఉన్న కో డైరెక్టర్ క్రాంతికుమార్ గారికి చెప్పారట. దీంతో తనను ప్రాణం ఖరీదు సినిమాలో ఒక క్యారెక్టర్ కి అనుకున్నప్పుడు తనకోసమే ఏలియాల్లో ఏలియాల్లో ఎందాక" అనే పాటను పెట్టారంటూ తన గురించి ఎవ్వరికీ తెలియని విషయాన్ని చెప్పారు చిరు. "దానికన్నా ముందు పునాదిరాళ్లు సినిమాలో డాన్స్ వేస్తూ ఫ్రెండ్స్ మధ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నాను" అంటూ అప్పట్లో జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ కి చీఫ్ అయినా లింగమూర్తిగారు కొత్తగా చిరంజీవి వస్తున్నాడు అతనితో సినిమాలు చేస్తే మీకు ఇంత డబ్బు ఇస్తాను లేదంటే లిమిటెడ్ గా ఇస్తాను అని చెప్పేవారని, దీంతో అందరూ చిరును హీరోగా పెట్టుకుందాం అంటూ తన వైపు చూసేవారని వెల్లడించారు మెగాస్టార్. లింగమూర్తికి ప్రజల నాడి తెలుసు కాబట్టి "ఆడియన్స్ ఇతని డ్యాన్స్ కోసమే సినిమాలకు వస్తున్నారు. అలాంటప్పుడు అతనితో సినిమాలు చేస్తే నాలుగు డబ్బులు వస్తాయి కదా" అని నిర్మాతలతో చెప్పడం, వాళ్ళు అవకాశాలు ఇవ్వడం తనకు ప్లస్ పాయింట్ అయింది అన్నారు చిరు. అలా అప్పట్లో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు చిరు పాటలు అనేసరికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవారట. అదే డ్యాన్స్ ఈరోజు చిరును ఇలా గిన్నిస్ బుక్ లో చేరేలా చేసి తెలుగు వారికి గర్వకారణం అయ్యేలా చేసింది.
Also Read: బ్రేకింగ్ న్యూస్... 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ - మెయిన్ రీజన్స్ ఇవే