అన్వేషించండి
Bloody Beggar Kavin Raj: తమిళ దాదా... తెలుగులో 'పాపా'... డిసెంబర్ రెండో వారంలో రిలీజ్
Bloody Beggar OTT Streaming: తమిళ సినిమా 'బ్లడీ బెగ్గర్'తో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సందడి చేస్తున్నాడు కోలీవుడ్ హీరో కవిన్ రాజ్. ఆయన తమిళ్ హిట్ 'దాదా' త్వరలో తెలుగులో విడుదల కానుంది.

'పాపా' సినిమాలో కవిన్ రాజ్, అపర్ణా దాస్
1/4

యంగ్ హీరో కవిన్ రాజ్ తమిళనాడులో పాపులర్. కొంతమంది తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన తెలుగు. ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో కవిన్ రీసెంట్ తమిళ్ ఫిల్మ్ 'బ్లడీ బెగ్గర్' సందడి చేస్తోంది. కొందరు తెలుగు ప్రేక్షకులు సైతం ఆ సినిమా చూశారు. వాళ్లకు ఓ న్యూస్. కవిన్ రాజ్ తమిళ సినిమా 'దాదా' అతి త్వరలో తెలుగులో విడుదల కానుంది.
2/4

'దాదా' సినిమాను తెలుగులో 'పా.. పా..'గా విడుదల చేయబోతున్నారు. ఇందులో కవిన్ రాజ్ సరసన అపర్ణా దాస్ నటించారు. తెలుగులో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'లో హీరో అక్క రోల్ చేశారు. డిసెంబర్ 13న ఏపీ, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియాలోని థియేటర్లలో విడుదల చేయనున్నారు. జేకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద నిర్మాత నీరజ కోట తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
3/4

కవిన్ రాజ్, అపర్ణా దాస్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తక్కువ నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ సినిమా తమిళనాట సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించిందని, తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని, ఇందులో కామెడీ - ఎమోషన్స్ - లవ్ యాంగిల్ - డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నిర్మాత నీరజ కోట తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 'పాపా'ను ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుదల చేయనున్నారు.
4/4

భాగ్యరాజా, వీటీవీ గణేష్, ఐశ్వర్య, ప్రదీప్ శక్తి నటించిన కవిన్ రాజ్, అపర్ణాల 'పాపా' చిత్రానికి జెన్ మార్టిన్ మ్యూజిక్, రవివర్మ ఆకుల లిరిక్స్ అందించారు.
Published at : 01 Dec 2024 03:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా రివ్యూ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion