అన్వేషించండి

Nara Lokesh: 'వర్శిటీల నుంచి వచ్చే ప్రతీ విద్యార్థికీ జాబ్ రావాలి' - ప్రతి నెలా జాబ్ మేళాకు క్యాలెండర్ రూపొందిస్తామన్న మంత్రి లోకేశ్

Andhra News: రాష్ట్రంలో ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వర్శిటీల నుంచి బయటకు వచ్చే ప్రతీ విద్యార్థికి జాబ్ రావాలని అన్నారు.

Nara Lokesh Review On Skill Development: రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించనున్నట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. యూనివర్శిటీల నుంచి బయటకు వచ్చే ప్రతీ విద్యార్థికీ ఉద్యోగం రావాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరికులమ్‌లో మార్పులు చేస్తామని.. పారిశ్రామికవేత్తలతో వర్శిటీల్లో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో స్కిల్ సెన్సెస్, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల్లో ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ ఇతర అంశాలపై చర్చించారు. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కార్యాలయాలపై నోట్‌కు మంత్రి ఆదేశించారు. అటు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రానికి చెందిన యూనివర్శిటీల ర్యాంకింగ్స్ మెరుగుదలకు విద్యా రంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని లోకేశ్ అధికారులకు నిర్దేశించారు. 2027 నాటికి మెరుగైన ర్యాంకింగ్ కోసం ప్రతీ యూనివర్శిటీకి లక్ష్యాన్ని నిర్దేశించాలని పేర్కొన్నారు. ఆంధ్రా, ఆచార్య నాగార్జున వర్శిటీలు టాప్ - 10లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.

Also Read: Tirupati Laddu controversy | కేంద్రం చేసిన పరీక్షల్లోనూ బయటపడిన కల్తీ - ఓ కంపెనీకి కేంద్ర ఆరోగ్య శాఖ నోటీసులు

'జగన్ అందుకు సిద్ధంగా ఉండాలి'

మరోవైపు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై (YS Jagan) మంత్రి లోకేశ్ (Lokesh) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయస్థానం, దేవుడి కోర్టులో శిక్షలకు జగన్ సిద్ధంగా ఉండాలని అన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో చేయకూడని పనులన్నీ చేశారని.. వైసీపీ అధినేత పాపం పండిందని విమర్శించారు. అధికారం ఉందనే అహంకారంతో కమీషన్లకు కక్కుర్తి పడి కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశుని సన్నిధిలో కల్తీ పనులు చేశారని మండిపడ్డారు. అడ్డంగా దొరికిపోయే సరికి తన ఫేక్ ముఠాలను దింపి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువుల కొవ్వు కలిపిన 4 ఏఆర్ డెయిరీ నెయ్యి లారీలను టీటీడీ తిప్పి పంపిందని.. నివేదిక ఈ విషయం స్పష్టం చేసిందని చెప్పారు. 

Also Read: AP Floods Amount: ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget