Lebanon Death Toll: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో 274 మందికి పైగా మృతి, లక్ష మందికిపైగా వలసలు
MEA WAR: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం తీవ్రమైన దాడులు.. 274 మందికి పైగా మృతి.. దకిణ లెబనాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వేలాది మంది వలస.. సంయమనం పాటించాలని ఐరాస సూచన.. ఇజ్రాయెల్ తీరుపై ఇరాన్ మండిపాటు
MEA WAR: గతవారం పేజర్ పేలుళ్లు, వాకీటాకీల విధ్వంసాలతో భయాందోళనలో మగ్గిన లెబనాన్.. ఇప్పుడు ఇజ్రాయెల్ రణ్నినాదంతో నిలువెల్లా వణికిపోతోంది. గాజా నుంచి లెబనాన్ వైపు దృష్టి మరల్చిన ఇజ్రాయెల్.. లెబనాన్ రాజధాని బైరూట్ లక్ష్యంగా జరుపుతున్న దాడుల్లో ఇప్పటి వరకూ 274 మందికి పైగా మృత్యు వాత పడగా.. వందల్లో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 21 మంది చిన్నారులు సహా మహిళలు కూడా ఉన్నారని.. లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో హడలిపోతున్న దక్షిణ లెబనాన్ వాసులు లక్ష మందికి పైగా ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు.
2023 అక్టోబర్ 7న హమాస్ సృష్టించిన నరమేథంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై దండెత్తి దాదాపు 40 మంది ప్రాణాలు తీసింది. ఈ క్రమంలో గాజాలో పరిస్థితులపై హెచ్చరికలు చేస్తూ వచ్చిన ఇరాన్ మద్దతుతో నడిచే లెబనాన్‌లోని హెజ్బుల్లాపై దాడులకు తెరతీసిన ఇజ్రాయెల్.. బైరుట్‌పై విమాన బాంబులతో విరుచుకుపడుతోంది,. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ధళాలు రాకెట్ లాంచర్ల దాడులు చేస్తుండగా.. శని ఆదివారాల్లో వారి లాంచింగ్ ప్యాడ్స్‌పై దాజులు చేసి దాదాపు 1000కి పైగా బ్యారెల్స్‌ను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సోమవారం నాడు.. నేరుగా నివాసిత ప్రాంతాలపై ఎక్కుపెట్టింది. దాదాపు 300లకు పైగా లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలుపగా.. ఈ దాడుల్లో గడచిన 24 గంటల వ్యవధిలో 274 మందికిపైగా మృత్యువాత పడగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపిన లెబనాన్.. అందులో ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారని వివరించింది. ఇజ్రాయెల్‌తో అపరిమిత యుద్ధం అంటూ ఆదావరం హెజ్బొల్లా ప్రకటించిన వేళ.. ఇజ్రాయెల్ సేనలు మరింతగా విధ్వంసం సృష్టిస్తున్నాయి.
శుక్రవారం నుంచి బైరుట్ సహా దక్షిణ లెబనాన్‌పై విరుచుకు పడుతున్న ఇజ్రాయెల్ సైన్యం:
#BREAKING
— Rula El Halabi (@Rulaelhalabi) September 23, 2024
🚨🚨🚨🇱🇧 ONGOING MASSACRE BY ISRAELI FORCES IN LEBANON!
Israel unleashes heavy strikes on South Lebanon and Bekaa including residential areas.
Health emergency: “Over 181 dead and over 727 injured in the latest update in recent hours”#LebanonUnderAttack… https://t.co/p1SB7Jln9x pic.twitter.com/dZxDsat31s
Hezbollah’s terrorism targets civilians.
— Israel Defense Forces (@IDF) September 22, 2024
Hundreds of thousands of Israeli civilians spent their night hiding in bomb shelters, while barrages of rockets were flying over their heads, some hitting their homes, and rocket alert sirens were constantly sounding throughout the night.… pic.twitter.com/2XzgAQQ7Fp
⭕️Approx. 180 Hezbollah targets and thousands of launcher barrels, ready for immediate use against Israeli civilians, were dismantled by a number of strikes in southern Lebanon.
— Israel Defense Forces (@IDF) September 21, 2024
The IDF will continue operating to dismantle and degrade Hezbollah's capabilities and terrorist… pic.twitter.com/lWyQNoydII
హెజ్బొల్లా స్థావరాలుగా ఉన్న ప్రాంతాల నుంచి బయటకు వెళ్లాలంటూ ఫోన్లకు సందేశాలు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో దాదాపు లక్ష మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేందుకు సిద్ధమవడంతో రోడ్లంతా కార్లతో నిండిపోయింది. ఇజ్రాయెల్ దాడుల్లో బెక్కా, నబతీ ప్రాంతాల్లో అనేక ఇళ్లు కార్యాలయాలు, ఫ్యాక్టరీలు తగల బడుతుండగా.. వాటిని అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఫైటర్స్‌ను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్ సైన్యం సామాన్యులను లక్ష్యంగా చేసుకొని బాంబులు వర్షం కురిపిస్తోందని ఇది సహించరాని నేరమని.. లెబనీస్ హెల్త్ మినిష్టర్ ఫిరాస్ అబియాద్ ఆరోపించారు.
మధ్యప్రాశ్చ్యం వివాదం పెద్దది కావాలని ఇజ్రాయెల్ కోరుకుటోందంని ఇరాన్ ధ్వజం:
లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. మధ్యప్రాశ్చ్యంలో శాంతియుత వాతావరణం కన్నా.. యుద్ధ వాతావరణాన్నే ఇజ్రాయేల్ కోరుకుంటోందని.. పరిస్థితి మరింత దారుణంగా మారుస్తోందని.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్.. న్యూయార్క్లోని యూఎన్జీఏ సమావేశం వద్ద ప్రెస్‌తో అన్నారు.
ఇజ్రాయెల్ దాడులను ఆపాలి: ఐక్యరాజ్యసమితి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు వెంటనే ఆపాలని.. ఐక్యరాజ్యసమితి సూచించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని సూచించింది. యుద్ధం నేపథ్యంలో రెడ్ క్రాస్ లెబనాన్‌కు తమ కార్యకర్తలను పంపిస్తోంది. అక్కడ అవసరమైన సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.