KA Paul : పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మళ్లీ నోటీసులు - ఈ సారి కేఏ పాల్ దెబ్బ!
Telangana : కాంగ్రెస్‌లో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేఏ పాల్ వేసిన పిటిషన్ మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.
Telangana High Court issued notices to ten BRS MLAs who joined the Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చిక్కులు తప్పడం లేదు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు సమస్యల్లో ఉన్నారు. తాజాగా మొత్తంగా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల జీతాలు, సౌకర్యాలు కట్ చేయాలని ఆయన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను విచారణ జరిపిన హైకోర్టు.. పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కాంగ్రెస్‌లో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన కాంగ్రెస్‌లో పది మంది ఎమ్మెల్యేలు చేరారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. వీరందరికీ హైకోర్టు అఫిడవిట్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినప్పుడు దాఖలైన పిటిషన్ ను విచారణ జరిపిన హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మారిన తర్వాత వారిపై అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. స్పీకర్ కు ఫిర్యాదు చేసినా గడువులోపు నిర్ణయం తీసుకోవడం లేదని..సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పట్టించుకోవడం లేదని వాదించారు.
సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు
ముగ్గురు అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు
బీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు .. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోపు అనర్హతా పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. లేకపోతే తాము మరోసారి విచారణ చేపడతామని ప్రకటించిది. ఈ తీర్పుపై ఇంకా అసెంబ్లీ స్పీకర్ కానీ.. స్పీకర్ కార్యదర్శి కానీ ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ లోపు కేఏ పాల్ పిటిషన్‌తో అందరికీ నోటీసులు జారీ అయ్యాయి. మామూలుగా అయితే వీరందరిపై అనర్హతా పిటిషన్లను బీఆర్ఎస్.. స్పీకర్ దగ్గర నమోదు చేసింది. స్పీకర్ ఇంత వరకూ విచారణ ప్రారంభించలేదు.
లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు- సమగ్ర విచారణ కోరిన వైసీపీ, బీజేపీ నేతలు
పది మంది ఎమ్మెల్యేలకు మరిన్ని చిక్కులు తెచ్చిన కేఏ పాల్
అయితే అనర్హతా పిటిషన్లపై తుది నిర్ణయం స్పీకర్ దేనని.. కోర్టులు జోక్యం చేసుకోలేవని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. అధికారం అంతా స్పీకర్ చేతుల్లోనే ఉంటుందని..ఫలానా తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని ఎక్కడా లేదని అంటున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పీకర్ స్పందనను బట్టి తదుపరి పరిణామాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.