అన్వేషించండి

Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు

Hydra : సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. నోటీసులు అందుకున్న దుర్గం చెరువు సమీపంలో ఇళ్లు కట్టుకున్న వారంతా కోర్టును ఆశ్రయించారు.

High Court stayed the demolition of Durgam Cheruvu Houses :  దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించారని హైడ్రా జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది.  2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు దుర్గం చెరువు పరిసర ప్రాంత నివాసితలు. తమ  అభ్యంతరాలపై  లేక్ ప్రొటెక్షన్ కమిటీ చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో  అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని  హైకోర్టు ఆదేశించి.. అప్పటి వరకూ కూల్చివేతలపై స్టే విధించింది.  అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుండి ఆరు వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఇంత అన్యాయమా రేవంత్? కోడలు ప్రెగ్నెంట్, ఏడికి పోవాలె - కన్నీళ్లు పెట్టించేలా మహిళ వీడియో

రాయదుర్గ్, మాదాపూర్‌ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు చుట్టూ పెద్ద ఎత్తున భవనాలు నిర్మాతం అయ్యాయి.  2014లో చెరువు వంద ఎకరాలు ఉందని నోటిఫై చేశార. ఇప్పుడు లెక్క వేస్తే 84 ఎకరాలు మాత్రమే ఉందని గుర్తించారు. అంటే పదహారు ఎకరాలు కబ్జాకు గురైనట్లుగా గుర్తించి.. ఫుల్ ట్యాంక్ లెవల్ వరకూ హద్దులు చూసి ఆ లోపుల ఇళ్లు ఉన్న వారందరికీ హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇలా నోటీసులు అందుకున్న వారిలో  సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి కూడా ఉన్నారు. ఆయన  మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి ఇల్లు ఉంది. అది ఎఫ్​టీఎల్ పరిధిలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే కూలగొట్టలేదు. 

దుర్గం చెరువు చుట్టూ  కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వంటి కాలనీలు ఉన్నాయి. వీటన్నింటికీ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ ఇళ్లు కొనుగోలు చేసిన వారిలో అత్యధికులు ప్రముఖులే.  ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. నెలలోగా ఈ అక్రమ కట్టడాలు కూల్చేయాలని నోటీసులు ఇవ్వడంతో.. వారు హైకోర్టుకు వెళ్లారు.    

కూకట్‌పల్లిలో హైడ్రా కొరడా! ఆ చెరువు చుట్టూ నిర్మాణాల కూల్చివేత

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిని  160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతం రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.  గత రికార్డుల ప్రకారం ఎఫ్‌టీఎల్‌ పరిధి కేవలం 65 ఎకరాలుగా మాత్రమే ఉందని ఆయన తరపు న్యాయవాదులు  కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.  ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ, నీటిపారుదలశాఖలతో పాటు హెచ్‌ఎండీఏకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరణలతో పాటు పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు  లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎదుట వాదనలు వినిపించాలని సూచించింది. ప్రస్తుతానికి.. తిరుపతి రెడ్డితో పాటు దుర్గం చెరువు పరిసరాల్లో ప్రాంతాల్లో ఉన్న వారికి కాస్త ఊరట లభించిందని అనుకోవచ్చు.                         

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!
మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!
Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!
GSLV F15 Satellite: సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbh 2025 Mouni Amavasya | మౌని అమావాస్య రోజు కుంభమేళాలో మహా అపశృతి | ABP DesamCM Yogi Adityanath Request Devotees | నాలుగు కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్న యోగి | ABP DesamISRO's Histroic 100th Launch Success | నేవిగేషన్ శాటిలైట్ ను సక్సెస్ ఫుల్ గా ప్రవేశపెట్టిన ఇస్రో | ABP DesamKeslapur Nagaoba Jathara | ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతరకు సర్వం సిద్ధం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!
మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!
Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!
GSLV F15 Satellite: సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
సెంచరీ కొట్టిన ఇస్రో - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15, చారిత్రాత్మక విజయం
Crime News: ఒకే ఊరిలో ఒకే టైమ్‌లో వివాహిత, యువకుడు ఆత్మహత్య - అనైతిక బంధం వెనుక విషాదం ఇదీ!
ఒకే ఊరిలో ఒకే టైమ్‌లో వివాహిత, యువకుడు ఆత్మహత్య - అనైతిక బంధం వెనుక విషాదం ఇదీ!
Budget 2025: పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా? - దీని గురించి ఎందుకు చర్చిస్తున్నారు!
పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా? - దీని గురించి ఎందుకు చర్చిస్తున్నారు!
CM Chandrababu: 'ఈ ఐదేళ్లలోనే బుల్లెట్ రైలుకు శంకుస్థాపన' - రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తేవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం
'ఈ ఐదేళ్లలోనే బుల్లెట్ రైలుకు శంకుస్థాపన' - రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తేవాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశం
SSMB29: ఆ ఒక్కటీ చెప్పొద్దు... మహేష్ బాబుతో పాటు అందరికీ రాజమౌళి కండిషన్, అగ్రిమెంట్స్
ఆ ఒక్కటీ చెప్పొద్దు... మహేష్ బాబుతో పాటు అందరికీ రాజమౌళి కండిషన్, అగ్రిమెంట్స్
Embed widget