అన్వేషించండి

ఇందూరు బీజేపీలో ఆధిపత్య పోరు- సీనియర్ల మధ్య ఆగని లొల్లి

ఇందూరు బీజేపీలో ఆధిపత్య పోరు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు బడా నేతల వ్యవహారం. కన్ఫ్యూసన్ లో క్యాడర్. వర్గాలతో చీలుతున్న పార్టీ.

ఓ వైపు బీజేపీ అధిష్ఠానం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణలోనూ ఫ్లవర్‌ పార్టీ పవర్‌లోకి రావాలనుకుంటోంది. దీని కోసం అన్ని జిల్లాల్లో స్పెషల్ ఫోకస్ పెట్టింది. జిల్లాల్లో బలపడేందుకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటోంది. అయితే కొన్నిచోట్ల జిల్లాల్లో విభేదాలు పార్టీకి పెద్ద సమస్యగా మారాయి. అలాంటిదే నిజామాబాద్‌లో కూడా ఎదుర్కొంటోంది పార్టీ. 

ఇందూరు జిల్లాలో బీజేపీకి పట్టు పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 28 కార్పొరేటర్లు బీజేపీ నుంచి గెలిచారు. గతంలో నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ నుంచి యెండల లక్ష్మినారయణ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మోడీ చరిస్మా నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తోంది. అంతా బాగానే ఉంది కానీ... నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నేతల మధ్య సఖ్యత లేకుండా పోయిందని టాక్ వినిపిస్తోంది. పార్టీ సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైందని సమాచారం.  

నిజామాబాద్ జిల్లాలో ధర్మపురి అరవింద్ ఎంపీగా ఎన్నిక కాక ముందు యెండల లక్ష్మినారాయణ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించేవారు. ధర్మపురి అరవింద్ ఏంట్రీ తర్వాత పార్టీలో మరింత జోష్ వచ్చింది. పార్టీలోకి వచ్చి రాగానే అరవింద్ ఎంపీగా గెలిచారు. అయితే అరవింద్ సీనియర్లను కలుపుకొని పోవట్లేదన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. మొదట్నుంచి అరవింద్‌కు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ పడదని పార్టీలో వర్గాలే చెప్పుకుంటాయ్. వీరిద్దరూ జిల్లా పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అరవింద్ ఉంటే యెండల లక్ష్మినారాయణ వర్గం దూరంగా ఉంటుంది. యెండల ఏదైనా కార్యక్రమం చేస్తే అరవింద్ వర్గం దూరంగా ఉంటుంది. 

తాజాగా హిందూ ఆలయ భూముల పరిరక్షణ సమితికి చెందిన పటేల్ ప్రసాద్‌పై అక్రమ కేసులు పెడుతున్నారంటూ... యెండల లక్ష్మినారాయణ అయన అనుచరులతో సీపీ ఆఫీస్‌కు వెళ్లారు. అందులో అరవింద్ వర్గానికి చెందిన ఒక్కరూ కూడా లేదు. అనూహ్యంగా యెండలతో బీజేపీ నేత వినయ్ రెడ్డి ఉన్నారు. 

అరవింద్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో బస్వ లక్ష్మినారాయణ, వినయ్ రెడ్డి అరవింద్‌తోనే ఉన్నారు. అరవింద్ విజయంలో వీరు కీలక పాత్రే పోషించారు. కానీ ప్రస్తుతం బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బస్వా లక్ష్మినర్సయ్య, వినయ్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అరవింద్ దూరం దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఓట్లు వచ్చాయ్. ఇందులో వినయ్ రెడ్డి పాత్ర కీలకం అని చెబుతారు. ఇటు జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య అరవింద్‌కు వెన్నంటే ఉండేవారు. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరి నేతలతో అరవింద్ అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ. అటు యెండల లక్ష్మినారాయణతో అరవింద్‌కు అసలు పొసగటం లేదన్నది కమలం పార్టీలో బహిరంగ సత్యం అని చెప్పుకుంటారు. 

ఓ వైపు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. బీజేపీ మాత్రం నేతల ఆధిపత్య పోరుతో క్యాడర్‌లో గందరగోళం కనిపిస్తోంది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 28 మంది బీజేపీ కార్పొరేటర్లకు ప్రస్తుతం 10 మందికే  పరిమితం అయ్యారు. అంటే కార్పొరేటర్లను పార్టీలో సరిగ్గా పట్టీంచుకోకపోవటం... సీనియర్లలో సఖ్యత లేకపోవటంతో వారు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కార్పోరేటర్లతో బడా నేతల వ్యవహార తీరు నచ్చకనే పార్టీ నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. 

పార్టీ కోసం సీనియర్లు సరైన పంథాలో పోతే జిల్లాలో పువ్వు పార్టీకి బలం పుంజుకుంటుంది. కానీ నేతల మధ్య అధిపత్య పోరుతో పార్టీ బలహీనంగా మారే ప్రమాదం లేకపోలేదంటోంది క్యాడర్. పార్టీని ముందుండి నడిపించాల్సిన సీనియర్ల మధ్య సరైన అవగాహన లేకుంటే అది పార్టీకే నష్టం అని భావిస్తోంది బీజేపీ క్యాడర్. ఓ వర్గం పార్టీ కార్యక్రమాలు చేస్తే మరో వర్గం దూరంగా ఉంటుంది. ఇలా వర్గపోరుతో రానున్న రోజుల్లో పార్టీకి కీడు తప్ప మేలు జరగదంటున్నారు. జిల్లాలో ఈ వర్గపోరుకు ఫుల్ స్టాప్ పడాలంటే బీజేపీ అగ్రనాయకత్వం ఎంట్రీ అవ్వాల్సిందే అంటున్నాయ్ జిల్లా పార్టీ వర్గాలు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందో ఎవరికి రాదో అన్న ఆందోళనలో కూడా ఉన్నారు ఆశావహులు. టికెట్ ఆశిస్తున్నవారికి సరైన హామీ దక్కక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget