News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Dharmapuri Arvind: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు వెంటాడుతోంది. కోడ్‌ ఉల్లంఘన కేసులో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాటిని ఆయన తిరస్కరించారు.

FOLLOW US: 
Share:

Dharmapuri Arvind: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు వెంటాడుతోంది. కోడ్‌ ఉల్లంఘన కేసులో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాటిని ఆయన తిరస్కరించారు. 2020 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ కోడ్‌ను ఉల్లంఘించారని అభియోగం నమోదైంది. ఎల్లమ్మగుట్టలో కోడ్‌ ఉల్లంఘించి ప్రచారం చేశారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్‌ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంపీ అరవింద్‌కు నోటీసు ఇచ్చేందుకు మంగళవారం నగర పోలీసులు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎంపీ అర్వింద్‌ అందుబాటులో లేరు. 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నగర పర్యటనలో భాగంగా బస్వా గార్డెన్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో ఆయన ఉన్నారనే సమాచారం మేరకు నాలుగో టౌన్‌ పోలీసులు అక్కడికి వెళ్లారు. నోటీసు విషయంపై ఎంపీతో చర్చించారు. నోటీసు తీసుకోవాలని పోలీసులు కోరగా అందుకు ఎంపీ అరవింద్‌ నిరాకరించారు. ఎన్నికలు ముగిసి దాదాపు నాలుగేళ్ల తర్వాత నోటీసులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. పోలీసులు చేసేది లేక ఉన్నతాధికారుల సూచనతో వెనుదిరిగారు. కొద్దిరోజుల్లోనే ఈ నోటీసును ఆయన ఇంటి అడ్రస్‌కు పోస్టు ద్వారా లేదంటే అధికారిక మెయిల్‌ ఐడీకి పంపనున్నట్టు పోలీసులు తెలిపారు.

అప్పటిలో కేసు..
2020లో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ప్రచార సమయం ముగిసిన అనంతరం ఫేస్‌బుక్‌లో మాట్లాడినందుకు ఆయన కేసు నమోదు చేశారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపి వేయాలనే నిబంధనను ఉల్లంఘించారనే ఆరోపణలపై జిల్లా ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే నగరంలోని ఓ ప్రార్థనా స్థలం వద్ద ఉన్న ఆక్రమణల విషయమై ఎంపీ తన ఫేస్‌బుక్‌ ఖాతాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసు విషయమై అర్వింద్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలోనే స్పందించారు. బ్యూరోక్రాట్‌ల విజ్ఞప్తి మేరకు ఈ పోస్టును తొలగించానని చెప్పారు. 

బీజేపీ శ్రేణుల ఆగ్రహం
తాజాగా పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చారు. ఎల్లమ్మగుట్టలో కోడ్ ఉల్లంఘనలు పాల్పడ్డారంటూ నోటీసులు జారీ చేశారు. ఇవ్వడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ కక్ష్య పూరిత చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.

Published at : 27 Sep 2023 01:34 PM (IST) Tags: Dharmapuri Arvind Police Notice Election Code Violation

ఇవి కూడా చూడండి

Kamareddy News: కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్‌కు షాక్ ఇచ్చిన వెంకటరమణారెడ్డి

Kamareddy News: కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్‌కు షాక్ ఇచ్చిన వెంకటరమణారెడ్డి

Rangareddy Assembly Election Results 2023: రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

Rangareddy Assembly Election Results 2023: రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

Telangana Elections Results 2023: తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగినా వీళ్ల ఓటమి మాత్రం పెద్ద షాక్‌

Telangana Elections Results 2023: తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగినా వీళ్ల ఓటమి మాత్రం పెద్ద షాక్‌

Nizamabad Assembly Election Results 2023: నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

Nizamabad Assembly Election Results 2023: నిజామాబాద్  జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

Medak Assembly Election Results 2023: మెదక్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

Medak Assembly Election Results 2023: మెదక్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!

టాప్ స్టోరీస్

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
×