అన్వేషించండి

MLC Kavitha: రేటెంత రెడ్డికి వాతలు తప్పవు, ఏకంగా కేసీఆర్ పైనే పోటీ చేస్తారా? కవిత సెటైర్లు

MLC Kavitha Satires on Revanth Reddy: రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేయడంపై కవిత ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై పోటీ చేస్తే వాతలు తప్పవని హెచ్చరించారు.

MLC Kavitha: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యంగ్యస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేయడంపై కవిత సెటైర్లు పేల్చారు. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్లే.. రేవంత్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్‌కు కూడా వాతలే మిగులుతాయని విమర్శించారు.  రేటెంత రెడ్డి మా సీఎం కేసీఆర్ (Telangana CM KCR) పైనే పోటీకి నిలుస్తారా? అంటూ ప్రశ్నించారు. వాతలు తప్ప ఫలితం ఏమీ ఉండదని,  కర్ణాటకలో చక్కదనం లేదుగానీ అక్కడి సీఎం సిద్దరామయ్య కామారెడ్డికి వచ్చి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనను చూసి ఆ రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారని ఆరోపించారు. 

శనివారం నిజామాబాద్‌లోని కేసీఆర్ కాలనీలోని న్యూ హౌసింట్ బోర్డు కాలనీ వెల్పేర్ అసోసియేషన్ హాల్‌లో జరిగిన గోసంగి కుల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో గోసంగి సంఘానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కోసం పనిచేసి గెలుపుకోసం కృషి చేయాలని వారికి కవిత సూచించారు. యాదవరాజుల కాలంలో సైనికులుగా గోసంగిలు పనిచేశారని, ఈ కులానికి ఎంతో చరిత్ర ఉందని కవిత ప్రశంసించారు. మీ సమస్యలను తాను పరిష్కరిస్తానని అన్నారు.

 గోసంగి ఉనికిని సంచార జాతులవారు దెబ్బతీస్తున్నారని, ఈ సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని కవిత స్పష్టం చేశారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.  దేశంలోనే ఆడ బిడ్డలకు బీడీ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని చెప్పారు.  మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్‌తో పాటు ఉచితంగా బస్ పాస్, 104 డయాలసిస్ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చినట్లు కవిత తెలిపారు.

బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కవిత స్పష్టం చేశారు.  బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ది జరిగిందో ఆలోచించుకుని ప్రజలు ఓటేయాలని సూచించారు. ఇంతకుముందు ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది గుర్తుంచుకోవాలని కోరారు. మూడు గంటల కరెంట్ చాలదా? అంటూ రైతులను అవమానించిన రేవంత్ రెడ్డికి కొడంగల్, కామారెడ్డిలో ఓటమి తప్పదని కవిత జోస్యం చెప్పారు. కామారెడ్డిలో ఖాళీ కుర్చీలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారని, తెలంగాణలో పిక్ వేవ్ ఒక్కటే ఉందన్నారు. తప్పుడు సర్వేలతో కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుందని, అంతమాత్రాన అధికారంలోకి రారని అన్నారు.

 కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని కవిత ఎద్దేవా చేశారు.  గతంలోని కాంగ్రెస్ భయానక పాలనను ప్రజలకు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌కు రైతులు మద్దతిచ్చే అవకాశాలు లేవని, అన్ని వర్గాలు బీఆర్ఎస్ వైపే ఉన్నాయని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సిద్దరామయ్య మోసం చేశారని, కేసీఆర్ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తారని కవిత తెలిపారు. బీఆర్ఎస్‌ను ప్రజలు ఆదరించాలని కోరారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget