Eatala Rajender: హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణ స్వీకారం
ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ కారుడని అన్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఇటీవలి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపొందిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేశారు. ఈటల రాజేందర్‌తో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి, సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత.. మీడియా పాయింట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఈటల అన్నారు. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ రూ.600 కోట్టు ఖర్చు పెట్టిందని ఆరోపించారు.
Also Read : మంత్రి హరీశ్ రావుకు వైద్య ఆరోగ్యశాఖ బాధ్యతలు.. ఉత్తర్వులు విడుదల
ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ కారుడని అన్నారు. ఉప ఎన్నికలో గెలవడంతో ఉద్యమకారులంతా పార్టీలకు అతీతంగా సంబర పడుతున్నారని అన్నారు. ఉద్యమ కారుడికి మద్దతుగా తాను కూడా అందుకే ప్రమాణ స్వీకారానికి వచ్చానని కొండా అన్నారు.
Also Read : ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం.. ఆదర్శంగా నిలిచారంటూ IASపై ప్రశంసలు
హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాషాయ జెండాను ఎగురవేసిన @Eatala_Rajender గారు నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో @BJP4Telangana నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా మీ పోరాటం సాగాలని ఆశిస్తున్నాను. pic.twitter.com/BUcMwdCg7o
— Dr.B.L.Sreenivas Solanky (@Solanky_BJYM) November 10, 2021
MLA పదవికి రాజీనామాను చేయడానికి వస్తే స్వీకరించడానికి రాని స్పీకర్ చేత..!
— Raghu Goud Nakirekanti (@raghu4bjp) November 10, 2021
హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి అదే స్పీకర్ చేత ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు ఈటెల రాజేందర్ అన్న.......@Eatala_Rajender @BJP4Telangana
Also Read: ఎదురొచ్చిన ఎన్నికల కోడ్.. కేసీఆర్ వరంగల్ టూర్ వాయిదా.. విజయగర్జన సభ కూడా !
Also Read : షర్మిల పాదయాత్రకు ఎన్నికల కోడ్ అడ్డంకి .. వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటన !