అన్వేషించండి

Palvai Sravanthi: మూడో రౌండ్లోనే కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి

కాంగ్రెస్ పార్టీకి ఆశించిన మేర ఓట్లు రావడం లేదని హస్తం నేతలు టెన్షన్ పడుతున్నారు. కౌంటింగ్ సెంటర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అకస్మాత్తుగా వెళ్లిపోయారు.

తెలంగాణలో రాజకీయ పార్టీలకు కీలకమైన మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఆశించిన మేర ఓట్లు రావడం లేదని హస్తం నేతలు టెన్షన్ పడుతున్నారు. అయితే తొలి రెండు రౌండ్లలో అధికార టీఆర్ఎస్ ఆధిపత్యం చెలాయించింది. మూడో రౌండ్ నుంచి బీజేపీ గేర్ మార్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మూడో రౌండ్ నుంచి ఓట్లు పెరగడంతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తున్నారు. నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యాక ఓవరాల్ గా బీజేపీపై టీఆర్ఎస్ 714 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఈసీ అధికారులు తెలిపారు.

కౌంటింగ్ సెంటర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అకస్మాత్తుగా వెళ్లిపోయారు. మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుండగా ఆమె బయటికి వచ్చారు. అయితే ఆమె అందరికంటే ముందుగానే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. మొదటి రెండు రౌండ్లలో పాల్వాయి స్రవంతికి బీజేపీ, టీఆర్ఎస్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆశించినంతగా ఓట్లు రాకపోవడం పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచింది. ప్రస్తుత కౌంటింగ్ శైలి గమనిస్తే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కొనసాగనుంది. నాలుగు రౌండ్ల తరువాత.. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి 26,443 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 25,729 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 7,380 ఓట్లు రాగా, అందోజు శంకరాచారికి 907 ఓట్లు వచ్చాయి.

అనుకున్నంత మెజార్టీ రాలేదన్న రాజగోపాల్ రెడ్డి 
నాలుగు రౌండ్ల లెక్కింపు తరువాత టీఆర్ఎస్ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. అయితే తమ విజయంపై బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఐదో రౌండ్ మొదలయ్యాక రాజగోపాల్ రెడ్డి కౌంటింగ్ సెంటర్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. ఓవైపు ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతుండగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదు. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చు. కానీ, బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉంది’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యంపైన టీఆర్ఎస్, బీజేపీ ఆగ్రహం
 రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను కిషన్ రెడ్డి ప్రశ్నించడంతో..  10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను అప్ లోడ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

టీఆర్ఎస్ సైతం.. 
రౌండ్ ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం కావడంపైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారులు లీకులు అందుతున్నాయన్న వార్తల పైన ఎలక్షన్ కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fire Accident In NIMS: హైదరాబాద్ నిమ్స్‌లో అగ్ని ప్రమాదం - ఎమర్జెన్సీ విభాగంలో మంటలు
Fire Accident In NIMS: హైదరాబాద్ నిమ్స్‌లో అగ్ని ప్రమాదం - ఎమర్జెన్సీ విభాగంలో మంటలు
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Hydra : టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
Smita Sabharwal: నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Loss in Chinna Swamy Stadium | ఆర్సీబీకి విజయాలను అందించలేకపోతున్న చిన్నస్వామి స్టేడియంPBKS Great Victories in IPL 2025 | ఊహించని రీతిలో విజయాలు సాధిస్తున్న పంజాబ్ కింగ్స్Trolls on RCB for Crossing 49 Runs | జర్రుంటే సచ్చిపోయేవాళ్లు..ఓ రేంజ్ లో RCB కి ట్రోల్స్Tim David 50* vs PBKS IPL 2025 | పీకల్లోతు కష్టాల్లో నుంచి RCB ని బయటపడేసిన టిమ్ డేవిడ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fire Accident In NIMS: హైదరాబాద్ నిమ్స్‌లో అగ్ని ప్రమాదం - ఎమర్జెన్సీ విభాగంలో మంటలు
Fire Accident In NIMS: హైదరాబాద్ నిమ్స్‌లో అగ్ని ప్రమాదం - ఎమర్జెన్సీ విభాగంలో మంటలు
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Hydra : టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన హైడ్రా - 17 ఎకరాల్లో కూల్చివేతలు - స్వాధీనం !
Smita Sabharwal: నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
నోటీసులపై స్మితా సబర్వాల్ తగ్గేదేలే.. అధికారులకే ట్విస్ట్ ఇచ్చిన సీనియర్ ఐఏఎస్
GVMC Mayor Voting: విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
విశాఖ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం
AP DSC Notification 2025: ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025లో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి?
ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025లో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి?
TG Inter Results 2025: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్ - రిజల్ట్స్ ఎప్పుడంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, పరీక్ష ఫలితాలు వచ్చేస్తున్నాయ్ - రిజల్ట్స్ ఎప్పుడంటే?
Lavanya and Raj Tarun case: లావణ్య, రాజ్ తరుణ్ మధ్యలో మంత్రి - వడ్డీకి డబ్బులిచ్చారట - ఇంటిపైనే కన్ను ?
లావణ్య, రాజ్ తరుణ్ మధ్యలో మంత్రి - వడ్డీకి డబ్బులిచ్చారట - ఇంటిపైనే కన్ను ?
Embed widget