Revant Reddy : టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాల వల్లే తెలంగాణకు నష్టం .. ప్రజల కోసం ఎంత వరకైనా పోరాడతామన్న రేవంత్ రెడ్డి !
టీఆర్ఎస్, బీజేపీ కుట్ర రాజకీయాల వల్లే ప్రజలకు కష్టాలు వచ్చాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. కలిసి పరిష్కరించే అవకాశం ఉన్నా.. కావాలనే సమస్యలు సాగదీస్తున్నారని విమర్శించారు.
రైతుల సమస్యల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య పరిష్కారం చేయకపోగా ఒకరికొకరు రాజకీయ ప్రయోజనం కోసం కొనుగోలు సమస్య ను పక్కదారి పట్టించారని రైతులను గాలికొదిలేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతుల ను పరమర్శించలేదని..ఆ కుటుంబలను ఆదు కోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని గతంలో ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చిందని..126 జీవో ద్వార ఉద్యోగాల భర్తీ ,బదిలీలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో ను తెచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. బండి ,గుండు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ జీవో రద్దు చేయవచ్చు..కానీ మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ జీవో రద్దు చేస్తామని రాజకీయ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ చర్యల వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారని.. ఈ సమస్యలు అన్ని పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు.
జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నుండి దాదాపు 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం పై సంపూర్ణ విశ్వాసం తో పార్టీలో చేరారన్నారు. పార్టీలో చేరిన వారంతా గతంలో ఎర్రబెల్లి విజయం కోసం పని చేశారని.. గెలిచిన తర్వాత అభివృద్ధి పై ఏ మాత్రం దృష్టి సారించకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్ ల పై మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్ పై ఒత్తిడి తేకపోవడం వల్ల విసిగిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి
Also Read: Dasari Arun Kumar: దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు... మద్యం మత్తులో కారుతో బీభత్సం
పంచ భూతాలను దోచుకుంటున్న అణచివేతలకు పాల్పడుతున్న కేసీఆర్ పాలనపై సామాజిక న్యాయం కోసం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉధృతమైన పోరాటం చేస్తున్నామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీనియర్ అధికార ప్రతినిధులు బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సామాజిక న్యాయం కోసం ఇప్పటికే తెలంగాణ లో దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమాలను చేపట్టామని దళిత, గిరిజనుల్లో ఆత్మ గౌరవాన్ని పెంపొందించేందుకు కాంగ్రెస్ కృషి చేసిందని అన్నారు. అభివృద్ధి పేరిట నీళ్లు, భూమి, విద్యుత్ తదితర అంశాలలో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారని అడ్డగోలుగా లక్షల కోట్లు దోచుకున్న నిధులతో తీవ్రమైన అణచివేతలకు పాల్పడుతున్నారని విమర్శించారు.