Dasari Arun Kumar: దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు... మద్యం మత్తులో కారుతో బీభత్సం
దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్ కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం తెల్లవారుజామున అరుణ్‌కుమార్ ర్యాష్ డ్రైవింగ్ చేసి రెండు బైక్ లను ఢీకొట్టారు.
ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు చిన్న కుమారుడు దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్ లో ర్యాష్ డ్రైవింగ్ చేశారన్న కారణంతో దాసరి అరుణ్ పై కేసు నమోదు చేశారు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రెండు ద్విచక్ర వాహనాలను అరుణ్ కుమార్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఉంటాడని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన విషయంలో దాసరి అరుణ్ కుమార్ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఆయనకు పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. అరుణ్ పై మోటార్ వెహికల్ చట్టం కింద 279,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కారు నడిపిన సమయంలో అరుణ్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో 405 పాయింట్లు నమోదైనట్లు తెలుస్తోంది.
Also Read: జగిత్యాలలో దారుణం... మంత్రాల నెపంతో ముగ్గురి దారుణ హత్య..!
ర్యాష్ డ్రైవింగ్ కేసు
టాలీవుడ్ హీరో దాసరి అరుణ్ కుమార్ ను పోలీసులు కేసు నమోదు చేశారు. లెజండరీ డైరెక్టర్ దివంగత దాసరి నారాయణ రావు చిన్న కొడుకు దాసరి అరుణ్ కుమార్. ఆయన్ను ర్యాష్ డ్రైవింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాసరి అరుణ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్లో ఈ తెల్లవారు జామున 4 గంటలకు దాసరి అరుణ్ కుమార్ కారును హై స్పీడ్ గా నడిపి రెండు బైకులను బలంగా ఢీ కొట్టారు. దీంతో ఆయనపై ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టారు పోలీసులు.
Also Read: తెలంగాణలో మరో కుంభకోణం? గిడ్డంగుల సంస్థలో రూ.కోట్లు కాజేసేందుకు కుట్ర!
గతంలోనూ కేసులు
దాసరి అరుణ్ కుమార్ పై గతంలో కూడా కేసులు నమోదు అయ్యాయి. దాసరి నారాయణరావు మరణించిన అనంతరం అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయి. అరుణ్ తమ ఇంట్లోకి గోడ దూకి అక్రమంగా ప్రవేశించి గొడవ చేశాడని ఆయన అన్న ప్రభు కేసు పెట్టారు. ఇప్పటికీ ఆ కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. వీటితో పాటు దాసరి అరుణ్ పై బయట కూడా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా అరుణ్‌కుమార్ ఇప్పటికే సామాన్యుడు, చిన్న, ఆది విష్ణు వంటి పలు సినిమాల్లో నటించారు.