అన్వేషించండి

Jagityala Crime: జగిత్యాలలో దారుణం... మంత్రాల నెపంతో ముగ్గురి దారుణ హత్య..!

జగిత్యాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం తారకరామ నగర్ లో ముగ్గురిని వెంటబడి దారుణంగా హత్య చేశారు. మంత్రాల నెపంతో హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

తెలంగాణలోని జగిత్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల తారకరామనగర్‌లో ముగ్గురిని హత్య చేశారు. తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. కుల సంఘం సమావేశం జరుగుతుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రాల నెపంతో ముగ్గురిని హత్య చేసినట్లు స్థానికులు అంటున్నారు. ఈ హత్యల సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ రూపేష్‌కుమార్‌, డీఎస్పీ ప్రకాశ్‌, సీఐ కృష్ణకుమార్‌ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసేందుకు కారణాలపై విచారణ చేపట్టారు. 

Also Read: తెలంగాణలో మరో కుంభకోణం? గిడ్డంగుల సంస్థలో రూ.కోట్లు కాజేసేందుకు కుట్ర!

చిత్తూరు జిల్లాలో దారుణం

 తాళి కట్టిన భర్తను భార్యే విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నరసారావు పేటకు చేందిన రవిచందర్‌కు గిద్దలూరుకి చేందిన వసుంధరకు 25 ఏళ్ళ క్రితం వివాహం అయ్యింది. అప్పటి నుండి రేణిగుంటలో‌ని బుగ్గ వీధిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ‌ కుమారుడు కూడా ఉన్నాడు. రవిచందర్ చిన్న పరిశ్రమను నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో తాను నడిపే పరిశ్రమ వద్ద ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలా కొద్ది నెలల పాటు అక్రమ సంబంధం బయటకు రాకుండా రవిచందర్ రహస్యంగా కొనసాగించేవాడు. 

Also Read: హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు వాడాల్సిన మందుల లిస్టు ఇదే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

అయితే తన భర్తకు మరొక మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న వసుంధర తరచూ రవిచందర్‌తో గొడవ పడేది. భర్తను మందలించే ప్రయత్నం చేసింది. కానీ, భర్తలో ఎటువంటి మార్పు రాకపోవడంతో రవిచందర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను నిలదీసింది. అయినా పలితం లేకపోవడంతో రోజూ ఇంట్లో భర్తతో గొడవకు దిగేది. ఈ వివాదం కాస్త రోజు రోజుకి అధికం అయ్యేది. ఇంట్లో కుమారుడికి మతిస్తిమితం లేని కుమారుడిని చూసుకోవాల్సింది పోయి మరొక మహిళతో అక్రమ సంబంధం ఎందుకని వసుంధర గట్టిగా భర్తను నిలదీసేది. ఇలా మాట మాట పెరిగి.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.  ఆ కోపంతో ఉన్న వసుంధర ఒక్కసారిగా భర్త రవిచందర్ పై ఓ కత్తితో దాడి చేసింది. రవిచందర్ ను అత్యంత క్రూరంగా హత్య చేయడమే కాకుండా అతని తలను, మొండేన్ని వేరు చేసి ఆ తలను ఓ కవర్‌లో వేసుకుని పోలీసులకు లొంగి పోయేందుకు ఆటోలో బయలు దేరింది. ఇంతలో ఆమె ఒంటిపై రక్తం మరకలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు వసుంధరను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తన భర్తతో విభేదాల కారణంగానే హత్య చేసినట్లు పోలీసులకు వసుంధర తెలిపినట్లు సమాచారం.

Also Read: కన్నా లక్ష్మీ నారాయణకి కోర్టులో చుక్కెదురు, కోడలు వేసిన పిటిషన్ వల్లే.. ఆమెకు కోటి చెల్లించాల్సిందేనని తీర్పు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget