Puvvada Caste Politics : ముప్పేట విమర్శలు - సామాజికవర్గ అస్త్రాన్ని బయటకు తీసిన పువ్వాడ అజయ్ !
సామాజికవర్గాన్ని తెర ముందుకు తెచ్చి రాజకీయాలు ప్రారంభించారు మంత్రి పువ్వాడ అజయ్. తనపై ఇతర పార్టీల నేతలు చేస్తున్న విమర్శలకు కులం కోణం తీసుకొచ్చారు.
![Puvvada Caste Politics : ముప్పేట విమర్శలు - సామాజికవర్గ అస్త్రాన్ని బయటకు తీసిన పువ్వాడ అజయ్ ! Minister Puvada Ajay started politics by bringing Caste to the forefront. Puvvada Caste Politics : ముప్పేట విమర్శలు - సామాజికవర్గ అస్త్రాన్ని బయటకు తీసిన పువ్వాడ అజయ్ !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/04/204c8dfdd94ce1d44e81642a6589d094_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఖమ్మంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో నలు వైపుల నుంచి తనపైనే ప్రధానంగా విమర్శలు వస్తూండటంతో మంత్రి పువ్వాడ అజయ్ సామాజికవర్గ అంశాన్ని తెరపైకి తెచ్చారు.ఓ వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరాలో ఓ కల్యాణ మండపం ఏసీ హాల్‌ను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సామాజికవర్గ పరమైన వ్యాఖ్యలు చేశారు.
అందుకే బియ్యం బస్తాలు తక్కువున్నాయి - సీబీఐ విచారణ చేయించుకోవచ్చని కిషన్ రెడ్డికి కమలాకర్ సవాల్
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో నాడు బడుగు బలహీన వర్గాల తో పాటు అందరికీ సమన్యాయం పాటించారని... ఇప్పుడు అదే కోవలో కెసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పక్కనున్న తెలుగు రాష్ట్రంలో ఓ సామాజికవర్గానికి అన్యాయం జరుగుతుందన్నారు. ఉన్న న్న ఒక్క ఓసి సీటు పీకేసిన చరిత్ర వారిదన్నారు. ఖమ్మంలో చిన్న సంఘటన జరిగితే ఆ సంఘటనే సాకుగా చూపి కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాధికారంలో ఓసీలకు మంచి స్థానం ఉందని పువ్వాడ అజయ్ చెప్పుకొచ్చారు. సామాజికవర్గం మొత్తం ఐక్యమత్యంగా ఉండవలసిన అవసరం ఉందని లేకుంటే విభజించు పాలించు అనే విధానాన్ని కొనసాగించేందుకు కొందరు కుటిల రాజకీయాలు చేస్తున్నారన్నారు. అందరూ ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు . అందరూ ఐక్యంగా ఉంటేనే సామాజికవర్గానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
ఖమ్మంపై కాంగ్రెస్ కన్ను, నేతల వరుస పర్యటనలతో జిల్లాలో జోష్ - ఆ హోదాలో రేవంత్ తొలిసారిగా
బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య కేసుతో పాటు విపక్షాలకు చెందిన ఇతరులపై కేసులు పెట్టించి వేధిస్తున్నారని పువ్వాడ అజయ్‌పై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో పువ్వాడ అజయ్ వ్యూహాత్మకంగా సామాజికవర్గాన్ని ముందుకు తీసుకువచ్చారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు అయిన పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పువ్వాడ అజయ్.. తనపై వస్తున్న విమర్శలకు సామాజికవర్గాన్ని అడ్డంగా పెట్టుకుని ఎదుర్కొనే ప్రయత్నం విమర్శలకు దారి తీస్తోంది.
బండి సంజయ్‌కు కర్ణాటక రైతుల షాక్- కేసీఆర్ పథకాలు అమలు చేయాలని లేఖ
ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ హవా ఎక్కువగా సాగుతూఉంటుంది. ఆయన తీరుపై పార్టీ పరంగా కూడా పలువురు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.ఈ క్రమంలో తన మంత్రి పదవిని తప్పించేందుకు కుట్రలంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్‌లోనూ అతర్గతంగా చర్చకు కారణం అవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)