Gangula Counter To Kishan : అందుకే బియ్యం బస్తాలు తక్కువున్నాయి - సీబీఐ విచారణ చేయించుకోవచ్చని కిషన్ రెడ్డికి కమలాకర్ సవాల్
ధాన్యం మాయం ఆరోపణలపై సీబీఐ విచారణ చేస్తే ఎవరు వద్దన్నారని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఎఫ్‌సీఐ అధికారుల తప్పిదాలవల్లే ధాన్యం మాయం ఆరోపణలు వస్తున్నాయన్నారు.
తెలంగాణలో ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగితే సీబీఐ విచారణ జరిపించుకోవచ్చని.. ఎవరు వద్దన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. తెలంగాణలో ధాన్యం సేకరణలో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందని విచారణకు ఆదేశించామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. కిషన్ రెడ్డి చెబుతున్నవన్నీ అబద్దాలేనని కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీయాలని, వ్యాపారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా డిల్లీ వేదికగా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజలను అవమానపర్చే విధంగా కిషన్ రెడ్డి మాట్లాడారన్నారు.
రైస్ మిల్లుల్లో బియ్యం మాయమయిందంటున్న కిషన్ రెడ్డి.. వాటికి కేంద్రం డబ్బులిచ్చిందా అని ప్రశ్నించారు. అన్ని రకాలుగా నిధులు సర్దుబాటు చేసుకుని రైతుల దగ్గర కొనుగోలు చేసేసి రాష్ట్రమేని..ఇందులో కేంద్రం పాత్ర లేదన్నారు. మిల్లర్లపై దాడులు చేసే అధికారం ఎప్.సి.ఐకు ఉందిన్నారు. ఎఫ్‌సీఐ చేసిన విచారణలో 4,53,000 బస్తాలు తక్కువ ఉన్నాయని కిషన్ రెడ్డి చెప్పారని.. ఇది కూడా చాలా తప్పుడు సమాచారమని గంగుల ప్రకటించారు. కొన్ని చోట్ల బ్యాగులు చినిగి వడ్లు కింద పడుతాయని వాటిని లెక్కించలేదన్నారు. కొన్ని చోట్ల మిల్లుల్లో బియ్యాన్ని ధాన్యంగా లెక్కించారు, కొన్ని చోట్ల పడిపోయిన బ్యాగుల్ని లెక్కించలేదు..వాటిలో సైతం బ్యాగులు చినిగి ధాన్యం అక్కడే ఉంది అయినా వాటిని ఎఫ్.సి.ఐ లెక్కలోకి తీసుకోలేదని గంగుల కమలాకర్ తెలిపారు.
రైస్ మిల్లుల్లో ఉన్నప్పుడు అవి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం మాత్రమేనని.ఎప్.సి.ఐ గోదాములోకి వెళ్లినప్పుడే అవి కేంద్రానికి చెందినవని కమలాకర్ స్పష్టం చేశారు. 2794 రైస్ మిల్లుల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఆర్ ఆర్ రికవరీ ఆక్ట్ ద్వారా రికవరీ చేస్తమన్నారు. బియ్యం మాయమైతే బారం రాష్ట్ర ప్రబుత్వంపై పడుతుంది, కేంద్రంపై కాదు, ఆ బియ్యాన్ని రికవరీ చేసే పటిష్ట చట్టాల్ని వాడుతున్నని స్పష్టం చేశారు. 2794 మిల్లుల్లో 40 మిల్లుల్లో తక్కువున్నాయి, అందులో రెండు మూడు బస్తాలు తక్కువున్న మిల్లులే ఎక్కువున్నాయని కమలాకర్ గుర్తు చేశారు.
ధాన్యం సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం దగ్గర మూడు కోట్ల యాబై ఏడు లక్షల గన్నీబ్యాగులు సిద్దంగా ఉన్నాయని కమలాకర్ ప్రకటించారు. పియూష్ గోయల్ కన్నా ఘోరంగా తెలంగాణ ప్రజల్ని కిషన్ రెడ్డి అవమానిస్తున్నారని గంగుల ారోపించారు. 2020-21 యాసంగిలో 62.52 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 89 శాతం ఇచ్చాం. అంటే 55.43 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో ఎఫ్ సిఐకి అప్పగించడం జరిగింది. యాసంగికి సంబందించి ఇప్పటికే 724 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. 104 కొనుగోలు కేంద్రాల ద్వారా 11,543 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామన్నారు. మిల్లర్లు తప్పు చేయకుండా 51 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. మండుటెండల్లో తెలంగాణ రైతాంగం కోసం పనిచేస్తుంటే బురద చల్లడం మంచిదికాదని..చేతనైతే సాయం చేయాలని హితవు పలికారు.