(Source: ECI/ABP News/ABP Majha)
Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్
Minister KTR: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. భారత దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
Minister KTR: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ సైనికులు రెండు రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. గత మూడు వారాల క్రితం మంత్రి కేటీఆర్ కాలికి గాయం అయింది. ఇంట్లో గాయం కాగా వైద్యులు కొన్ని రోజుల పాటు రెస్టు తీసుకోవాలని సూచించారు. అయితే కాలి నొప్పితోనే ఆయన విధులు నిర్వర్తించారు. కాలి నొప్పి కారణంగా ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా మంత్రి కేటీఆర్ పరేడ్ మైదానానికి వచ్చారు. 3 వారాల తర్వాత ఆయన ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సుమారు గంటన్నర పాటు ఆయన వేడుకల్లో పాల్గొన్నారు.
"ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, కాలి గాయం వల్ల దాదాపు మూడు వారాలుగా ఇంట్లోనే ఉన్నాను. మూడు వారాల తర్వాత నేను పాల్గొన్న తొలి కార్యక్రమం ఇది. భారతదేశం విశిష్టమైనది. భారత్ ను మరే దేశంతో పోల్చలేం. చైనాతో అనేక విషయాల్లో పోటీ పడుతున్నప్పటికీ... మన ప్రత్యేకతలు వేరు. ప్రతి 100 కిలో మీటర్లకు విభిన్న సంస్కృతి కనిపిస్తోంది. ప్రపంచానికే ఆదర్శంగా మనం దేశం కొనసాగాలి". - మంత్రి కేటీఆర్
భారత్ ప్రపంచ దేశాలకు దిక్యూచి
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన భారత దేశం రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలకు దిక్సూచిగా ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశ, రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్... ప్రపంచ దేశాలతో పోల్చలేమని , మన దేశం చాలా గొప్పదంటూ కొనియాడారు. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాలి గాయం వల్ల మూడు వారాల పాటు ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చిందని తెలిపారు. మూడు వారాల తర్వాత నేను పాల్గొన్న తొలి కార్యక్రమం ఇదంటూ మంత్రి కేటీఆర్ వివరించారు. భారత దేశం విశిష్టమైనదని, భారత్ ను మరే దేశంతో పోల్చలేమని అన్నారు. చైనాతో అనేక విషయాల్లో పోటీ పడుతున్నప్పటికీ మర ప్రత్యేకతలు వేరని చెప్పారు. ప్రతి 100 కిలో మీటర్లకు విభిన్న సంస్కృతి కనిపిస్తోందని గుర్తు చేశారు. ప్రపంచానికి భారత దేశం ఆదర్శంగా ఉంటుందని.. మన దేశం ఇలాగే కొనసాగాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న వజ్రోత్సవాలు..
స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. ఈ నెల 8వ తేదీన హెచ్ఐసీసీలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ నెల 22వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని సీఎం తెలిపారు. వజ్రోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మువ్వన్నెల రంగులు అలరిస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణాలు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అందంగా తీర్చి దిద్దారు.