KTR : తెలంగాణలో తొలి అగ్రికల్చర్ డేటా ఎక్సేంజ్ - ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణలో తొలి అగ్రికల్చర్ డేటా ఎక్సేంజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
KTR : వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నామని చెప్పారు. రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదన్నారు. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదని వెల్లడించారు. హైదరాబాద్ శంషాబాద్‌లోని నోవాటెల్‌లో దేశంలోనే తొలి అగ్రికల్చర్ డేటా ఎక్సేంజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు ఒక రైతు కాబట్టి వ్యవసాయంపై అవగాహన ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని అతి తక్కువ సమయంలో నిర్మించామని చెప్పారు.
IT and Industries Minister @KTRBRS speaking after launching the Agricultural Data Exchange Platform and the Agricultural Data Management Framework for Telangana. https://t.co/oKfgLzWzqA
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 11, 2023
గతంలో పాలమూరు నుంచి వలసలు ఉండేవని, ఇప్పుడు వలసలు లేవని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. దేశంలో నాణ్యమైన పత్తి తెలంగాణ నుంచి వస్తున్నదని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించామనన్నారు. దేశంలో నాణ్యమైన పత్తి తెలంగాణ నుంచి వస్తున్నదని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించామనన్నారు. రైతు ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందన్నారు.. ఉమ్మడిపాలనలో కనీసం ఏడాదికి ఒక పంట వేసుకోలేని దుస్థితి నుంచి కెసిఆర్ పాలనలో మూడు పంటలు వేసే స్థాయికి ఎదిగామని చెప్పారు కెటిఆర్ ..
దేశంలోనే తొలిసారిగా వ్యవసాయ డేటా ఎక్సే్ఛంజి(ఏడీఈఎక్స్)ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో బెంగళూరులోని ఐఐఎస్‌సీ రెండేల్ల కిందట ఒప్పందం చేసుకుంది. ఇండియా అర్బన్ డేటా ఎక్సే్ఛంజి (ఐయూడీఎక్స్)ని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖతో కలిసి ఇప్పటికే ఐఐఎస్‌సీ ఏర్పాటు చేసింది. పట్టణ ప్రాంతాల ప్రజలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని ఇదే రీతిలో ఏడీఈఎక్స్‌ను రైతులకు అనేక సేవలందించే వేదికలా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. విత్తనాల లభ్యత, పంటల సాగుకు సలహాలు, సూచనలు, బీమా తదితర సేవలు దీనిద్వారా అందించాలనేది ప్రణాళిక. ప్రయోగాత్మక ప్రాజెక్టుగా 2023లో నిర్దేశిత సేవలను దీని ద్వారా అందిస్తారు.