Minister Harish Rao: తెలంగాణలో తొలిడోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేశాం.. 7,970 బృందాలు పనిచేస్తున్నాయి
తెలంగాణలో తొలి డోసు వంద శాతం పూర్తైనట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వంద శాతం పూర్తి చేసుకున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కృషితో వంద శాతం తొలి డోసు పూర్తి చేసుకున్నామని.. మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజల్లో ఉండే అనుమానాలు, అపోహలు నివృత్తి చేశామని చెప్పారు. వంద శాతం తొలి డోసు వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఇదంతా.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషేనని అభినందించారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. అధికారులకు.. మార్గనిర్దేశం చేసినట్టు చెప్పారు.
తెలంగాణలో 7,970 వ్యాక్సినేషన్ బృందాలు పనిచేస్తున్నాయని హరీశ్ రావు చెప్పారు. వ్యాక్సినేషన్ బృందాలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తున్నాయన్నారు. వ్యాక్సినేషన్ విషయమై కేంద్రం లక్ష్యం విధించిందని తెలిపారు. తెలంగాణ జనాభాలో రెండు విడతల్లో 5.55 కోట్ల డోసులు ఇవ్వాలని హరీశ్ రావు చెప్పారు. తెలంగాణలో తొలి డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేశామన్నారు. 'రెండో డోసు 66.1 శాతం పూర్తి చేశాం. తొలి డోసులో జాతీయ సగటు కంటే పది శాతం అధికం సాధించాం. రెండో డోసులో జాతీయ సగటు 63.1 శాతంగా ఉంది. జాతీయ సగటు కంటే 3 శాతం ఎక్కువ సాధించాం.' అని హరీశ్ రావు చెప్పారు.
వ్యాక్సినేషన్ లో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు భాగస్వామ్యమయ్యాయని, ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారని.. హరీశ్ రావు చెప్పారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయడంలో కృషి చేశారన్నారు. మూరుమూల ప్రాంతాల్లోనూ ప్రతీ గడపకు వెళ్లీ టీకాలు వేశారని గుర్తు చేశారు. కరోనా భయంలో వ్యాక్సిన్ అనేది సంజీవని అని చెప్పారు. నాణ్యమైన వైద్యంతో పాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేసినట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు. 18 ఏళ్లు దాటిన వారిని.. వ్యాక్సినేషన్‌లో భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు.
Also Read: Corona Updates: ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
Also Read: Precaution Dose: 60 ఏళ్ల పైబడిన వారికి ప్రికాషన్ డోస్ కోసం.. మెడికల్ సర్టిఫికెట్ అవసరం లేదు
Also Read: AP BJP : బెయిల్‌పై ఉన్న నేతలు జైలుకెళ్లడం ఖాయం... ప్రజాగ్రహ సభలో ప్రకాష్ జవదేకర్ జోస్యం !
Also Read: Hindupuram Balakrishna : హిందూపురంలో డంపింగ్ యార్డ్ వివాదం.. బాలకృష్ణ ఇంటి ముట్టడితో ఉద్రిక్తత!