అన్వేషించండి

BRS News : కేసీఆర్‌పై మహారాష్ట్ర నేతల ఫైర్ - బలప్రదర్శన ఆందోళనకరమన్న శరద్ పవార్ !

కేసీఆర్‌పై మహారాష్ట్ర వికాస్ ఆఘాడి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ బీ టీంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

 

BRS News : తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం 600 వాహనాలతో షోలాపూర్ లో బలప్రదర్శన చేయడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ అసహనం వ్యక్తం చేశఆరు.  కేసీఆర్ పర్యటనలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత బీఆర్ఎస్ లో చేరారు. బలాన్ని చూపించడానికి ఈ ప్రయత్నంచేయడం  ఆందోళనకరమని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.  పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రార్థనలు చేయడానికి వస్తే, అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ వాహనాల సంఖ్య పరంగా బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం ఆందోళన కలిగించిందని అన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించి ఉంటే బాగుండేదని పవార్ అన్నారు. 

డ్రామాలు వద్దన్న  శివసేన నేత సంజయ్ రౌత్ 

2021 పంఢర్‌పూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఎన్‌సిపి టిక్కెట్‌పై పోటీ చేసి  ఓడిపోయిన  భగీరథ్ భాల్కే మంగళవారం ర్యాలీలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ల ఒక వ్యక్తి పార్టీని విడిచిపెట్టినట్లయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవార్ స్పష్టం చేశారు.  భగీరథ భాల్కేకు టికెట్ ఇచ్చిన తర్వాత మా ఎంపిక తప్పని గ్రహించామని . అయితే దాని గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నారు. అంతకు ముందు కేసీఆర్‌ డ్రామాలు మానుకోవాలని శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం నేత సంజయ్‌ రౌత్‌ హితవు పలికారు. డ్రామాలు ఇలాగే కొనసాగితే తెలంగాణలో కూడా అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.  

మహా వికాస్ ఆఘాడికి నష్టం చేసేలా బీజేపీకి మేలు చేసేలా కేసీఆర్ రాజకీయాలు 

బీఆర్‌ఎస్‌ బీజేపీకి బీ టీమేనని వ్యాఖ్యానించారు. ఓట్లు చీల్చి శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రె్‌సల  మహా వికాస్‌ అఘాడి  అవకాశాలను దెబ్బతీయడం తప్ప కేసీఆర్‌కు మహారాష్ట్రలో వేరే ఉద్దేశాలు లేవన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైన 9 ఏళ్లలో, అంతకు ముందు ఏపీ మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఒక్కసారి కూడా పండరీపురాన్ని సందర్శించలేదని గుర్తు చేశారు. కేసీఆర్‌ ఎవరికి తన బలాన్ని ప్రదర్శించాలని చూస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ తనకు వ్యక్తిగతంగా మిత్రుడేనని అన్నారు. ముందు ఆయన ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేయబోతున్నారో తేల్చుకోవాలని చెప్పారు.  తెలంగాణలో  బీఆర్‌ఎస్‌ పునాదులు కదులుతుండటంతో ఏం చేయాలో తోచక ఆయన మహారాష్ట్రకు వచ్చారన్నారు.               

భారీ బలప్రదర్శన చేసిన కేసీఆర్ -  బీఆర్ఎస్‌లో చేరిన ఎన్సీపీ నేత                           
 
కేసీఆర్ తన పర్యటన భాగంగా షోలాపూర్ సమీపంలోని పండర్‌పూర్ పట్టణంలోని విఠల్ స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం బిఆర్‌ఎస్ విస్తరణ ప్రయత్నాలలో భాగంగా సర్కోలి గ్రామంలో భారీ బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు. దీంతో పాటు ఉస్మానాబాద్‌లోని దేవి తుల్జా భవానీ ఆలయంలో పూజలు చేశారు.  2024 లోక్ సభ ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ ఈ కసరత్తు ప్రారంభించారు. బీఆర్‌ఎస్‌ ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా అవతరించేందుకు ఈ రెండు ఎన్నికలు దోహదపడతాయని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake prediction for Ramagundam: రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
IPL 2025 DC VS RCB Result Update: ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. డీసీని గెలిపించిన రాహుల్.. 
ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. 93 రన్స్ తో డీసీని గెలిపించిన రాహుల్.. 
Gorantla Madhav arrest:  పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP DesamMS Dhoni to Lead CSK IPL 2025 | సీఎస్కే ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్..ఓ బ్యాడ్ న్యూస్ | ABP DesamRCB vs DC Match Preview IPL 2025 | పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొదమ సింహాల ఢీSai Sudharsan Batting IPL 2025 | 30 మ్యాచులుగా వీడిని డకౌట్ చేసిన మగాడే లేడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake prediction for Ramagundam: రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
IPL 2025 DC VS RCB Result Update: ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. డీసీని గెలిపించిన రాహుల్.. 
ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. 93 రన్స్ తో డీసీని గెలిపించిన రాహుల్.. 
Gorantla Madhav arrest:  పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
Mega Star Chiranjeevi On Mark Shankar:
"మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు" హ్యాపీ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి 
CSK Captain MS Dhoni: చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
Mangalagiri Latest News: మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి  నెల 13న శంకుస్థాపన చేయనున్న లోకేష్
మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నెల 13న శంకుస్థాపన చేయనున్న లోకేష్
Kohli Stunning Record:  కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్లో ఆ ఫీట్ చేసిన తొలి ప్లేయ‌ర్.. ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు త‌న పేరిటే..
కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్లో ఆ ఫీట్ చేసిన తొలి ప్లేయ‌ర్.. ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు త‌న పేరిటే..
Embed widget