Singareni Jagruti: బీఆర్ఎస్ కార్మిక సంఘానికి చెక్ - సింగరేణిలో జాగృతి శాఖ ఆవిర్భావం - కవిత కొత్త పార్టీ ఖాయమా ?
Singareni: సింగరేణికి జాగృతి శాఖను కవిత ప్రకటించారు. ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధ సంఘం ఉంది. దీంతో కొత్త పార్టీకి శాఖల్ని అప్పుడే ప్రారంభిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

Kavitha announced the Singareni Jagruti: భారత రాష్ట్ర సమితిపై అసంతృప్తితో ఉన్న కవిత కీలక రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా సింగరేణి జాగృతి షాథనుర్కాకంఙింటాకుయ బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ సింగరేణి 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను ఎమ్మెల్సీ కవిత నియమించారు. *సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశామని ప్రకటించారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించి సింగరేణిని రక్షించుకున్నామని.. అలాంటి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతితో అంతం చేయాలని చూస్తోందని ఆరోపించారు.
సింగరేణి సమస్యలపై పోరాటానికి సింగేరణి జాగృతి
సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీ కోసం పని చేస్తున్నాడని అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్కమాట మాట్లాడటం లేదన్నారు. అలియాస్ నేమ్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు. అయితే ఇలాంటి ఉద్యమాలు చేయడానికి ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ ఉంది. అయితే సంఘంతో కలిసి సమన్వయం చేసుకుంటూ పని చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఒకే పార్టీకి చెందిన రెండు శాఖలు ఉండటం ఆశ్చర్యమేనని తాను పెట్టబోయే పార్టీ కోసం శాఖల్ని కవిత ఇప్పుడే రెడీ చేసుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కేసీఆర్ రాయబారాలు ఫలించలేదా ?
సోమవారం కేసీఆర్ తరఫున ఎంపీ దీకొండ దామోదర్ రావుతో పాటు లాయర్ గండ్ర మోహన్ రావు కవితతో చర్చలు జరిపారు. కేసీఆర్ కూడా కవితతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్టీలో తన పాత్రపై క్లారిటీ ఇవ్వాలని కవిత డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లేకుంటే తనదారి తాను చూసుకుంటానని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుకు కవిత రెడీ అవుతున్నట్లు కవితకు సపోర్టుగా ఉండేవారు పోస్టులు పెడుతున్నారు.
జూన్ రెండున కవిత కొత్త పార్టీ : రఘునందన్
మరో వైపు బీజేపీ ఎంపీ రఘునందన్ రెడ్డి కవిత రెండో తేదీన కొత్త పార్టీ పెడతారని ప్రకటించారు. కవిత కొత్త పార్టీ ప్రకటించవచ్చని, షర్మిల తరహాలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయవచ్చని ఎంపీ రఘునందన్ రావు వంటి వారు పేర్కొన్నారు. అయితే, ఈ వాదనలను కొందరు బీఆర్ఎస్ కుటుంబం ఆడుతున్న రాజకీయ నాటకంగా కొట్టిపారేస్తున్నారు. ఈ ఊహాగానాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఖండించారు. కవిత ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పార్టీ పెట్టరని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయంపై కవిత స్వయంగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, కానీ జాగృతిని మరింతగా యాక్టివ్ చేసే ప్రయత్నంలో కవిత ఉండటంతో .. పార్టీ పెట్టడం కాయమన్న సంకేతాలు వస్తున్నాయంటున్నారు.





















