అన్వేషించండి

ఎమ్మెల్యేల కొనుగోళ్లకు డీల్- కరీంనగర్ నేతల్లో టెన్షన్ !

ఎమ్మెల్యే ల కొనుగోళ్ల వ్యవహారంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు కూడా టార్గెట్ అయినట్లు తెలుస్తోంది. మరి జిల్లాలో ఏం జరుగుతుందో ఓసారి చూసేద్దామా..!

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్కెచ్ విఫలమైందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఎక్కడ ఓడిపోతామో అనే భయంతోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు నాటకం ఆడుతుందని బీజెపీ కామెంట్లు చేస్తోంది. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ సాగుతుంది. రెండు పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఇతర పార్టీలకు చెందిన వారిని ప్రలోభాలతో లోబర్చుకొని అనైతికంగా పార్టీ మార్పిడులకు ప్రోత్సహిస్తున్నారని భావన అంతటా వ్యక్తం అవుతుంది. అయితే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై సెటైర్లు విసరడం తెలిసిందే. ఈ వ్యవహారంలో  ఎంత వరకు నిజమున్నా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు నిజమే కావచ్చునని అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

 15 మందిలో కరీంనగర్ కు చెందిన వాళ్లే ఇద్దరు.. 

పార్టీ మారనున్నారని చెబుతున్న 15 మంది ఎమ్మెల్యేల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇద్దరు ఉన్నారని, ఈ డీల్ సందర్భంగా కూడా వారి పేర్లు చర్చకు వచ్చాయని జిల్లాలో చర్చించుకుంటున్నారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ రాజేందర్ కు ఇక్కడ ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు ఉండడం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ జిల్లా వారి కావడంతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలపై ప్రధానంగా దృష్టి సారించారని అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు ప్రతి కీలక సందర్భంలో కేసీఆర్ వెంట ఉంటూ వస్తున్న కరీంనగర్ జిల్లా కేసీఆర్ కు సెంటిమెంట్ జిల్లా కావడంతో ఇక్కడ నుంచి ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టాలని బీజేపీ అగ్ర నేతలు భావించినట్లు సమాచారం. ఇక్కడి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్ కంచుకోటగా పేర్కొనే కరీంనగర్ లోని ఆ పార్టీకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈటెల, బండి పట్టుదలతో ఉన్నారని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. 

టీఆర్ఎస్ కు షాకిచ్చేందుకు బీజేపీ స్కెచ్..

జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు మరో ఇద్దరు ప్రముఖ నాయకులతో ఈ విషయమై పలు దఫాలుగా చర్చలు జరిపాలని తెలిసింది. టీఆర్ఎస్ లో ఈసారి 30 నుంచి 40 మందికి టికెట్లు రావు అని ప్రచారం జరగడమే కాకుండా పార్టీ అధినేత కూడా అలాంటి హెచ్చరికలు చేయడంతో అనుమానాలు ఉన్న కొందరు బీజేపీతో టచ్ లోకి వెళ్లారని సమాచారం. పరిస్థితి ఏర్పడినప్పుడు సమీక్షించుకుంటూ పార్టీలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఆయా ఎమ్మెల్యేలు, నాయకులు బీజేపీతో టచ్ లోనే ఉన్నా అవునని కానీ కాదని కానీ స్పష్టమైన సంకేతాలు ఏమీ ఇవ్వలేదని సమాచారం. బీజేపీ నుంచి స్వామి గౌడ్, భిక్షమయ్యగౌడ్, దాసోజు శ్రావణ్ టీఆర్ఎస్ లో చేరడంతో దానికి ప్రతిగా టిఆర్ఎస్ కు తిరుగులేని షాక్ ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేల పార్టీ మార్పిడికి స్కెచ్ వేసిందని అనుకుంటున్నారు. 

అందులో భాగంగానే కరీంనగర్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా సంప్రదించారని అయితే వారు అందుకు తిరస్కరించారని చెబుతున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలందరికీ మళ్లీ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన రోజే పార్టీ మారే ఆలోచనను విరమించుకొని నియోజకవర్గంలో చురుకుగా తిరుగుతున్నారని తెలుస్తోంది. కానీ ఇద్దరు మాత్రం అసంతృప్తితో ఉండగా బీజేపీ వారికి వల వేసిందని తెలిసింది. ఆ ఇద్దరు కూడా బీజేపీలో చేరడానికి నో చెప్పడంతో జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరూ టిఆర్స్ ను వీడలేదని తేలిపోయింది. గతంలోనూ ఒకసారి ఉమ్మడి జిల్లా నేతలు ఉన్నట్టుగా వచ్చిన ప్రచారం ఈసారి కూడా నిజమేనా అనే చర్చ ఇక్కడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget