Wonder Kid: లోగో చూసి కారు పేరు చెప్పేస్తున్నాడు- ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్‌కే షాక్ ఇచ్చిన బాలుడు
ముడేళ్లకే వండర్స్ చేస్తున్నాడా బాలుడు. లోగోలు చూసి కార్లు పేర్లు చెప్పేస్తున్నాడు. దీంతో ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు దక్కించుకున్నాడు.
కరీంనగర్ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేశ రాజు పల్లి గ్రామం. ఈ గ్రామానికి చెందిన కోల ప్రేమ్ సాగర్, మౌనిక ఉద్యోగరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డారు. వీరి కుమారుడైన అభిజిత్ చిన్నప్పటి నుంచి ఎక్కువగా కార్ల బొమ్మలతోనే ఆడుకునేవాడు. కార్లు అంటేనే చాలా ఆసక్తి చూపేవాడు.
కార్లతో ఆడుకొని ఆడుకొని వాటి పేర్లను గుర్తు పట్టడం ప్రారంభించాడు. మొదట్లో పెద్దగా పట్టించుకోని తల్లిదండ్రులు ఓ రోజు అభిజిత్ టాలెంట్ గమనించారు. చిన్నారి గ్రాస్పింగ్ పవర్ చూసి ఓ డిఫరెంట్ ఫీట్ కోసం ప్రిపేర్ చేశారు. కార్ల కంపెనీల లోగోలు చూపిస్తూ వాటి పేర్లు చెప్పేలా ట్రైన్ చేశారు.
అలా ట్రైన్ చేసిన తర్వాత లోగోలు చూపిస్తే చాలు కంపెనీల పేర్లు చెప్పడం స్టార్ట్ చేశాడు. దాదాపు 110 కంపెనీల వరకు లోగోలను చూసి కంపెనీల పేర్లను అది కూడా రికార్డు సమయంలో చెప్పే వరకూ వెళ్ళాడు అభిజిత్. ఇండియా, జర్మనీ, జపాన్, అమెరికాలో తయారయే హై ఎండ్ మోడల్ కార్ల కంపెనీలు కూడా ఉన్నాయి.
ఇలాంటి ఫీట్‌ను తమ అబ్బాయి చిన్నవయసులో అతి తక్కువ సమయంలో సాధించడం తమకు కూడా ఎంతో ఆనందంగా ఉంది అంటున్నారు అభిజిత్ తల్లి మౌనిక. చివరికి తాము షాపింగ్ చేసే సమయంలోనూ తను కార్ల బొమ్మలనే ఎక్కువగా అడిగే వాడని ...అందుకే తాము కూడా అతని ఆసక్తిని గమనించి ఎంకరేజ్ చేశామని ఆమె అంటున్నారు.
అంతేకాదండోయ్ ఈ బాబు పాటలూ పాడగలడు... డాన్స్ చేయగలడు... రకరకాల యాక్టింగ్ స్కిల్స్‌ని కూడా చేసి చూపించగలడు... చిన్న ఏజ్‌లోనే వండర్ ఫీట్ సాధించిన ఈ కిడ్ ఫ్యూచర్‌లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యామిలీ మెంబర్స్ ఆశిస్తున్నారు.