News
News
X

Karimnagar Rains: మంథని ఎందుకంత ఎఫెక్ట్ అయింది, నేటి తీవ్ర పరిస్థితులకు కారణం ఇదేనా !

Manthani Rains: దాదాపు నాలుగు దశాబ్దాల కింద కురిసిన భారీ వర్షాలతో అంతగా ప్రభావితం కాని మంథని ప్రజలు తాజా వర్షాలతో మాత్రం ఇబ్బంది పడుతున్నారు.

FOLLOW US: 

Paddapalli Rains: ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నగరాలు నీటి పాలయ్యాయి. అయితే దాదాపుగా 39 ఏళ్ల కిందట ఉమ్మడి జిల్లాలోని మంథని (పెద్దపల్లి జిల్లా) పట్టణానికి వచ్చిన వరద కూడా అప్పట్లో పెద్దగా ప్రభావితం చేయలేదు. కానీ ఈ సారి ప్రకృతి పగబట్టిందా అనే తీరుగా వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు మంథని నగరమంతా ప్రభావితం అయింది. ఎక్కువ వరదలు వచ్చినా రాని పరిస్థితి  ఈసారి ఎందుకు వచ్చిందో ఓ సారి చూద్దాం. నిజానికి మంథని చుట్టూ ఆరు ప్రధాన చెరువులు ఉన్నాయి ఈసారి అన్నింటిలోనూ మొత్తం పురపాలక సంఘం పరిధిలో 13 వార్డులలో దాదాపు 22 వేల జనాభా నివాసముంటున్నారు. ఇక పట్టణంలో లోతట్టు ప్రాంతాలు, మురికివాడలు దాదాపు 10 వరకు ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న 30 వరకు ఇల్లు దెబ్బతిన్నాయి. దొంతులవాడ, మరివాడ, లైను గడ్డ, రజక వాడ, నాయి బ్రాహ్మణవాడ, బోయి పేట, వాగుగడ్డ  ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కారణాలు ఇవేనా..
ఒకేసారి  కాళేశ్వరం ప్రాజెక్టు లోని సుందిళ్ల బ్యారేజీ నుండి 72 గేట్లు తెరవడంతో 13 లక్షల క్యూసెక్కుల మీరు దిగువ ప్రాంతానికి ప్రవహించింది. దీంతో రెండు రోజుల్లోనే మూడు లక్షల క్యూసెక్కుల నీరు స్థానిక బొక్కల వాగు నుంచి వెనక్కి వెళ్లి మంథని ప్రధాన మురుగు కాలువ ద్వారా పట్టణంలోకి వచ్చింది. ఖానాపూర్ గ్రామ సమీపంలో గోదావరి లో కలిసే అవకాశం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇక 6 కోట్ల రూపాయల బడ్జెట్ తో కట్టిన ఇరువైపులా ఐదేళ్ల కిందట దాదాపు 68 కోట్లతో కట్టిన కరకట్టలు కూడా వరద నీటిని పట్టణంలోకి రాకుండా నివారించలేక పోయాయి. దీంతో భారీ వర్షాలతో ఆకస్మికంగా వచ్చిన వరద నీరు పట్టణంలోకి చుకుని వచ్చి పలు ప్రాంతాలను నీటిపారుదల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరామయ్య అంటున్నారు.

నిజానికి ఇంత పెద్ద స్థాయిలో ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఇలా చేయి దాటిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఒకే సారి వచ్చిన వరద నీరు పట్టణంలోకి దారి అసలు కారణంగా గుర్తించారు. కేవలం కిలోమీటర్ చెక్ డాం బొగ్గుల వాగు నిర్మించారు. ఎంత వరద ఉధృతి ఉన్నా మూడు మీటర్ల మేర గోడ కూడా నిర్మించారు. మరోవైపు మూడు మీటర్ల లోతులో కింది నుండి నాలా కూడా పూర్తయింది.  కానీ వరద నీటిని మాత్రం అడ్డుకోలేక  పోయాయి .దీనిపై మరోసారి అధికారులు  ఆలోచించి భవిష్యత్తులో పకడ్బందీగా వ్యవహరిస్తే గాని మళ్లీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా నివారించవచ్చు.Published at : 18 Jul 2022 10:38 AM (IST) Tags: telangana rains rains in telangana karimnagar Karimnagar Rains Manthani Paddapalli

సంబంధిత కథనాలు

Safai Mitra: సఫాయి మిత్ర పోటీల్లో కరీంనగర్ ముందంజ, మొదటి స్థానాన్ని దక్కించుకుంటుందా?

Safai Mitra: సఫాయి మిత్ర పోటీల్లో కరీంనగర్ ముందంజ, మొదటి స్థానాన్ని దక్కించుకుంటుందా?

Cotton Farmers News: పత్తి రైతుల పుట్టి ముంచుతున్న అధిక వర్షాలు, ఏం చేసేది?

Cotton Farmers News: పత్తి రైతుల పుట్టి ముంచుతున్న అధిక వర్షాలు, ఏం చేసేది?

KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా

KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా

Ponnam Prabhakar: పొన్నం ప్రభాకర్ పాదయాత్రలో ఏఐసీసీ కార్యదర్శి

Ponnam Prabhakar: పొన్నం ప్రభాకర్ పాదయాత్రలో ఏఐసీసీ కార్యదర్శి

Heavy Floods to Godavari: గోదావరికి మళ్లీ పెరిగిన వరద ఉద్ధృతి, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక!

Heavy Floods to Godavari: గోదావరికి మళ్లీ పెరిగిన వరద ఉద్ధృతి, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక!

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు

రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు

రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్‌న్యూస్, తెలంగాణ సర్కార్‌కు షాక్ - కీలక తీర్పు

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!

AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?

AP Teachers :