అన్వేషించండి

Jagityala Politics: మాజీ ఎమ్మెల్యేకి అవమానాలు, ప్రస్తుత ఎమ్మెల్యేపై ఆరోపణలు! జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడతారా?

Jagtial News | తన అనుచరుడు హత్యకు గురికావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికార పార్టీ అయి ఉండి కార్యకర్తల్ని కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Jeevan Reddy News | జగిత్యాల: తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఇటీవల అన్ని చేదు అనుభవాలే ఎదురవుతున్నాయా అంటే అవుననే వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఓవైపు పార్టీ నుంచి మరోవైపు నియోజకవర్గంలో అన్ని చేదు అనుభవాలే ఎదురవతున్నాయి. ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలో తనకు జరిగిన అవమానాలను దిగమింగుకొని పార్టీలో కొనసాగుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీని సైతం వీడతారని ఒకానొక సమయంలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో జీవన్ రెడ్డి మరొక చేదువార్తను వినాల్సి వచ్చింది.

జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు మాజీ ఎంపీటీసీ గంగా రెడ్డి హత్యకు గురికావడం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో తాను ఎదుర్కొన్న పరిణామాలతో విసిగెత్తి ఉన్నారు. జీవన్ రెడ్డి పార్టీలో సరిగ్గా ఇమడలేకపోతున్నారని.. అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లాలో జరిగిన హత్యకు ఆందోళనకు దిగిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

"మీకో దండం మీ పార్టీకో దండం" అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థలు పెట్టుకుని అయినా ప్రజలకు సేవ చేస్తాను కానీ పార్టీలో మాత్రం ఉండనంటూ తెగేసి చెప్పేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అవమానించిన మానసికంగా వేధించిన భరించాం, అయినా మమ్మల్ని బ్రతకనివ్వరా అంటూ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ తో ఘాటు వ్యాఖ్యలతో తన ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి.

ఈ హత్య వెనక ఎమ్మెల్యే సంజయ్ హస్తం ఉందా...?

బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి ముఖ్య అనుచరుడే నిందితుడు భక్తిని సంతోష్ గౌడ్. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నిందితుడిని పెంచి పోషించేవారని మృతుడు గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపించారు. 20 కేసులు ఉన్న రౌడీ షీటర్ తో పోలీసులకు సన్నిహిత సంబంధాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు కాబట్టే పోలీసులకు నిందితుడు సంతోష్ కి సన్నిహిత సంబంధాలు ఉండటంతో అతడి విషయాన్ని చూసీ చూడనట్టుగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగిత్యాల రూరల్ ఎస్సై హస్తం ఉందా?

మారి ఎంపిటిసి గంగారెడ్డి హత్య వెనకాల జగిత్యాల రూరల్ ఎస్సై హస్తం కూడా ఉందని హత్యకు గురైన జీవన్ రెడ్డి అనుచరుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. నిందితుడు బత్తిని సంతోష్ గౌడ్ రూరల్ ఎస్సైతో ఎప్పటినుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకోసమే తనపై చర్యలు తీసుకోలేదు కనీసం 100 కు డయల్ చేసినా కూడా స్పందించలేదు, కనుక ముమ్మాటికి పోలీసుల హస్తం ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల రూరల్ ఎస్సై ఫోన్ కాల్ డేటా హిస్టరీని తీస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు.

Also Read: KTR On Konda Surekha : వ్యక్తిగత దాడులను సహించను - లక్ష్మణ రేఖ గీస్తా - మరోసారి కేటీఆర్ హెచ్చరిక

కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు...!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ జగిత్యాల జిల్లాలో మాత్రం బిఆర్ఎస్ హవా నడుస్తుందని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఇలా నడిరోడ్డుపై హత్యకు గురయ్యా ముమ్మాటికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. కనీసం పార్టీ నాయకులను కూడా కాపాడుకోకపోతే ఇక పార్టీలో ఉండడం ఎందుకని ప్రశ్నించారు.

Also Read: Jagtial News: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య- జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh : వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
Teenmar Mallanna : సొంత ప్రభుత్వంపై  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు - ఈ సారి  కొరియా టూర్‌పై విమర్శలు
సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు - ఈ సారి కొరియా టూర్‌పై విమర్శలు
Amaravati Drone Summit 2024: ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్
ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్
Unstoppable 4 Promo: బాలయ్య చమత్కారం, చంద్రబాబు సమయస్ఫూర్తి... తప్పు చేసినోడ్ని వదలను - 'అన్‌స్టాపబుల్ 4' ప్రోమోలో వార్నింగ్
బాలయ్య చమత్కారం, చంద్రబాబు సమయస్ఫూర్తి... తప్పు చేసినోడ్ని వదలను - 'అన్‌స్టాపబుల్ 4' ప్రోమోలో వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?విషం ఎక్కించినా చావని మొండోడు.. హమాస్‌ న్యూ చీఫ్ మాషల్మేం ఉండగా ఒక్క ఘటన లేదు, రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్బంకర్‌లో దర్జాగా బతికిన సిన్వర్, వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh : వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
Teenmar Mallanna : సొంత ప్రభుత్వంపై  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు - ఈ సారి  కొరియా టూర్‌పై విమర్శలు
సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు - ఈ సారి కొరియా టూర్‌పై విమర్శలు
Amaravati Drone Summit 2024: ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్
ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్
Unstoppable 4 Promo: బాలయ్య చమత్కారం, చంద్రబాబు సమయస్ఫూర్తి... తప్పు చేసినోడ్ని వదలను - 'అన్‌స్టాపబుల్ 4' ప్రోమోలో వార్నింగ్
బాలయ్య చమత్కారం, చంద్రబాబు సమయస్ఫూర్తి... తప్పు చేసినోడ్ని వదలను - 'అన్‌స్టాపబుల్ 4' ప్రోమోలో వార్నింగ్
Jagtial News: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య- జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య- జగిత్యాల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత
Udhayanidhi Stalin : నేను కరుణానిధి మనవడ్ని తగ్గేదే లేదు - తేల్చేసిన ఉదయనిధి - పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించేనా ?
నేను కరుణానిధి మనవడ్ని తగ్గేదే లేదు - తేల్చేసిన ఉదయనిధి - పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించేనా ?
Amyra Dastur Photos: బికినిలో అమైరా దస్తూర్ బోల్డ్ ఫోటోలు... మాల్దీవ్స్ వెళ్తే మరి తప్పదుగా!
బికినిలో అమైరా దస్తూర్ బోల్డ్ ఫోటోలు... మాల్దీవ్స్ వెళ్తే మరి తప్పదుగా!
Telangana Crime News: హోటల్‌లో కుక్కను తరుముతూ వెళ్లిన యువకుడు- మూడో అంతస్తు నుంచి పడి దుర్మరణం
హోటల్‌లో కుక్కను తరుముతూ వెళ్లిన యువకుడు- మూడో అంతస్తు నుంచి పడి దుర్మరణం
Embed widget