అన్వేషించండి

Karimnagar: సర్దార్‌జీకి టైమొచ్చిందా? సీఎం వద్ద ఎనలేని ప్రాధాన్యం, బిహార్ పర్యటనకు కూడా

కరీంనగర్ పట్టణంలోని సిక్కువాడకు చెందిన రవీందర్ సింగ్ మొదట విద్యార్థి స్థాయిలోనే స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు.

కరీంనగర్ మాజీ మేయర్ టీఆర్ఎస్ సీనియర్ నేత సర్దార్ రవీందర్ సింగ్ రాజకీయ ప్రస్థానం అనూహ్య మలుపులు తిరగబోతోందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది ఒక సమయంలో పార్టీ నుండి బలవంతంగా బయటకు వెళ్లే పరిస్థితిని సృష్టించిన సొంత పార్టీ నేతలే ఇప్పుడు సర్దార్ జి కి సరైన సమయం వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు. అసలేం జరుగుతోందంటే

సర్దార్ రవీందర్ సింగ్... కరీంనగర్లో సీనియర్ రాజకీయ నేతగా పేరున్న నాయకుడు. పట్టణంలోని సిక్కువాడకు చెందిన రవీందర్ సింగ్ మొదట విద్యార్థి స్థాయిలోనే స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తరువాత రవీందర్ సింగ్ మొదట 1995 లో స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్ గా ఎంపికై తర్వాత బీజేపీలో కొనసాగారు. ఆ పార్టీ పట్టణ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఒకవైపు న్యాయవాదిగా పనిచేస్తూనే స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సైతం ఎన్నికయ్యారు. నిత్యం ప్రజల్లో ఉండడంతో అప్పుడు మంచి దూకుడు మీదున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం దృష్టిలో పడ్డారు. 

కేసీఆర్ పట్టణంలో పట్టు కోసం బలమైన నేత కోసం ఎదురు చూస్తుండగా ఇటు మైనార్టీ నేతగా న్యాయవాదిగా పేరున్న రవీందర్ సింగ్ ని ఎంపిక చేసుకున్నారు. ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన రవీందర్ సింగ్ కి రాష్ట్ర ఏర్పాటు తర్వాత సరైన పదవి దక్కింది. కరీంనగర్ లాంటి కీలక పట్టణ కార్పొరేషన్ కి మేయర్ గా ఎంపిక చేశారు. కేసీఆర్ హాయాంలో 2014 నుండి 2019 వరకు మేయర్ గా పని చేసిన రవీందర్ సింగ్ ప్రాధాన్యత స్థానిక మంత్రితో విభేదాల వల్ల నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది.
Karimnagar: సర్దార్‌జీకి టైమొచ్చిందా? సీఎం వద్ద ఎనలేని ప్రాధాన్యం, బిహార్ పర్యటనకు కూడా

 పలుమార్లు పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడడంతో అధిష్టానం సైతం తీవ్ర చర్యలు తీసుకుంటుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఇక ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీకి రాజీనామా చేసిన రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. దీంతో పాటు మంత్రి గంగుల కమలాకర్.. అతని అనుచరుల కార్పొరేటర్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకానొక సమయంలో తిరిగి భారతీయ జనతా పార్టీలకు వెళ్లిపోతారంటూ ప్రచారం సైతం జరిగింది.

కానీ ఏ రోజు కూడా ఈ విషయంపై పెదవి విప్పని రవీందర్ సింగ్ సొంతంగానే పోటీకి సై అన్నారు. పట్టణంలో పార్టీని చీల్చబోతున్నారా? అని అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి. దీంతో కొంత కాలం పాటు స్థానిక నాయకులు కార్యకర్తలలో గందరగోళం నెలకొంది. చివరకు ఎన్నికల వరకు సైలెంట్ గా ఉన్న రవీందర్ సింగ్ కి ఆకస్మికంగా కేసీఆర్ నుండి పిలుపు రావడంతో ప్రగతి భవన్ వెళ్లి కలిశారు. మళ్లీ అప్పటినుండి సీఎం కేసీఆర్ రవీందర్ సింగ్ కి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. ముఖ్యంగా జాతీయస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ అందుకు అనుగుణంగా సిక్కు సామాజిక వర్గానికి చెందిన రవీందర్ సింగ్ కి మళ్లీ చోటు ఇవ్వడంతో పాటు ఉత్తర భారత దేశ పర్యటనలో తన వెంట తీసుకు వెళ్ళడం మొదలుపెట్టారు. ఏకంగా పార్టీ అధినేత నుండి ప్రాధాన్యత రావడంతో సర్దార్జీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Embed widget