Karimnagar News : కరీంనగర్ ట్రాఫిక్ విధుల్లో పుష్ప పోలీస్, సెల్ఫీల కోసం ఎగబడుతున్న స్థానికులు
Karimnagar News : పుష్ప సినిమాలో కనిపించే ఎస్పీ భన్వర్ సింగ్ షేకావత్ ను పోలిన వ్యక్తి కరీంనగర్ లో దర్శనమిచ్చారు. అతనితో కలిసి స్థానికులు ఫొటోలు దిగేందుకు పోటీపడుతున్నారు.
Karimnagar News : మీరు ఎప్పుడైనా కరీంనగర్ వెళ్లారా పోనీ మీరు కరీంనగర్ వాసులు అయితే ఎప్పుడైనా అలా రోడ్లపై ఓ రౌండ్ వేస్తూ ఉంటే మీకు ఆకస్మికంగా కనిపిస్తారు పుష్ప లోని పోలీస్ క్యారెక్టర్ బన్వర్ సింగ్ షెకావత్ అదేంటి అనుకుంటున్నారా. మీరు చూసే ఉంటారు ప్రముఖ కేరళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన పుష్ప ఓ ట్రెండ్ సెట్టర్. అందులో మెయిన్ పోలీస్ క్యారెక్టర్ పేరు భన్వర్ సింగ్ షేకావత్. నున్నని గుండుతో పెద్ద మీసాలతో తనదైన శైలిలో ఉండే డైలాగులతో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో జీవించారు ఫాజిల్. అందులో హీరో అల్లు అర్జున్ తో మాట్లాడే ఓ డైలాగ్ ఉంది. అదే " పార్టీ లేదా పుష్ప" ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందంటే ఇప్పుడు దాదాపు అన్ని మీమ్స్ లోనూ ట్రెండింగ్లో ఉంది.
(ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ )
బుల్లెట్ శీను అని ఫేమస్
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉండే ఓ కానిస్టేబుల్ పేరు శ్రీనివాస్. తోటి సహచరులు ముద్దుగా బుల్లెట్ శీను అని పేరు పెట్టుకున్నారు. మొదటి నుంచి కూడా శ్రీనివాస్ మీసాల కట్టు, రకరకాల హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేవారు. అంతేకాకుండా ట్రాఫిక్ కి ముందు తను ఉండే రెగ్యులర్ పోలీసు డ్యూటీస్ లో మంచి ఫిజిక్ మెయింటైన్ చేసేవారు. అయితే ఇదంతా పుష్ప సినిమా రిలీజ్ ముందు వరకూ ఎవరు పట్టించుకోలేదు. కానీ పుష్ప సినిమా రిలీజ్ కావడం, అతిపెద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంతో అందరూ అందులోని పోలీస్ పాత్రని చూసి శ్రీనివాస్ ని చూసేసరికి షాక్ అవుతున్నారు. దాదాపు అదే పోలికలతో ఉన్న శ్రీనివాస్ తో కలిసి ఫోటోలు దిగుతున్నారు. ఇలా పబ్లిక్ తనతోబాటు సెల్ఫీలు దిగడం తనకు సంతోషాన్నిస్తుంది అంటున్నారు శ్రీనివాస్.
Also Read : Bullet Bike Burnt: అనంతపురంలో పేలిన ఆయిల్ ట్యాంక్, బుల్లెట్ బైక్ దగ్ధం - కారణం అదే అంటున్న స్థానికులు
Also Read : Banjara Hills Drugs Case : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో నలుగురి అరెస్టు, వెలుగులోకి సంచలన విషయాలు!