అన్వేషించండి

Banjara Hills Drugs Case : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో నలుగురి అరెస్టు, వెలుగులోకి సంచలన విషయాలు!

Banjara Hills Drugs Case : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో నలుగురి పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన డ్రగ్స్ కేసులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

Banjara Hills Drugs Case :  బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవరు సప్లై చేశారు? ఎవరెవరు తీసుకున్నారన్న కోణంలో విచారణ చేస్తు్న్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. డీజే ఆపరేటర్‌ వంశీధర్‌రావు, ఈవెంట్‌ మేనేజర్‌ అనిల్‌, పబ్‌ నిర్వాహకుడు అభిషేక్‌ ముప్పల, వీఐపీ మూమెంట్‌ చూసే కునాల్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

పబ్ లో డ్రగ్స్ స్వాధీనం 

ఈ కేసులో ప్రముఖులు చాలా మంది ఉండడంతో అసలు డ్రగ్స్‌ పబ్‌లోకి ఎలా వచ్చాయనే కోణం పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. పబ్ లో పోలీసులు ఇప్పటి వరకూ 5 గ్రాముల కొకైన్‌, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. చాక్లెట్‌ రోల్స్‌లో ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్‌ పెట్టుకుని డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. పబ్ లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను ఎఫ్ఎస్‌ఎల్‌ రిపోర్టు కోసం పంపించారు. ఆ నివేదిక అందిన తర్వాత పబ్‌లో వినియోగించిన మాదక ద్రవ్యాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశముందని పోలీసులు అంటున్నారు.

బంజారాహిల్స్‌ ఇన్ స్పెక్టర్  శివచంద్ర సస్పెండ్ 

ఈ పబ్ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో డ్రగ్స్‌ పట్టుబడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంజారాహిల్స్‌ ఇన్ స్పెక్టర్  శివచంద్రను సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్‌ శారు. ఆయన స్థానంలో ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావును నియమించారు.  బంజారాహిల్స్ పీఎస్ కు నూతన ఇన్ స్పెక్టర్ గా నాగేశ్వర్ రావు నియమించారు సీపీ ఆనంద్.  నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ గా నాగేశ్వరరావు పనిచేశారు.  టాస్క్ ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు టీమ్ పబ్ లో శనివారం రాత్రి డెకాయ్ ఆపరేషన్ చేసింది.  పబ్ లో డ్రగ్స్ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు. గతంలో ఎన్నో సంచలన కేసులు ఛేదించిన రికార్డు నాగేశ్వరరావు సొంతం. బంజారాహిల్స్ డ్రగ్స్ కేసును నూతన ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు విచారిస్తు్న్నారు.   ఇప్పటికే నిర్లక్ష్యం వహించిన ఇన్ స్పెక్టర్ శివ చంద్ర సీపీ సస్పెండ్ చేశారు. గతంలో శి చంద్రపై సెటిల్మెంట్లు ఆరోపణలు ఉన్నాయి.  పబ్ లపై నిఘా పెట్టకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
ONGC Gas Leak: అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!
అదుపులోకి మామిడికుదురు గ్యాస్ బ్లో అవుట్‌.. లీకేజీ ఆగిందని ఓఎన్‌జీసీ ప్రకటన!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Samantha : బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
Litton Das World Record:  టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
Embed widget