అన్వేషించండి

Mlc Kavita: పేద‌ల‌ను మోసం చేయ‌డంలో బీజేపీ నంబ‌ర్ వ‌న్ : ఎమ్మెల్సీ కవిత

టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటిదని ఎమ్మెల్యే కవిత అన్నారు. మాయ‌మాట‌లు చెప్పడం, మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టడం, రైతుల‌ను, పేద‌ల‌ను మోసం చేయ‌డంలో బీజేపీ నంబ‌ర్ వ‌న్ అని క‌విత విమర్శించారు.

తెలంగాణ ప్రజ‌ల గుండెల్లో టీఆర్ఎస్(TRS) ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత(Mlc Kavita) అన్నారు. కామారెడ్డి(Kamareddy) జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముజిబుద్దీన్ ప్రమాణ‌స్వీకారం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాల నుంచి టీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్నారు. తెలంగాణ‌(Telangana)కు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసిన సీఎం కేసీఆర్(Kcr) ఉద్యమాన్ని ముందుకు న‌డిపించారన్నారు. టీఆర్ఎస్ పార్టీని న‌మ్మిన ప్రజలు పట్టంకట్టారన్నారు. అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను రెండు సార్లు సీఎం చేశారన్నారు. టీఆర్ఎస్ పార్టీ 70 ల‌క్షల స‌భ్యతాల‌కు చేరుకుందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీ న్యాయం, ధ‌ర్మం వైపే ఉంటుదని క‌విత స్పష్టం చేశారు. 

గత రెండేళ్లుగా క‌రోనా ఉన్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదన్నారు. ఆస‌రా పెన్షన్లు, రైతుబంధు, రేష‌న్ బియ్యంతో సహా ఇతర పథకాలు అమలు చేశామని ఎమ్మెల్యే కవిత తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ‌ల‌స కార్మికుల‌ను ఆదుకోలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రైతుల‌కు అన్నం పెడుతుంటే మోదీ సున్నం పెడుతున్నారని విమర్శించారు. వ్యవ‌సాయ మోటార్లకు మీట‌ర్లు పెట్టాల‌ని కేంద్రం పట్టుబడుతోందన్నారు. తెలంగాణ‌కు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల‌పై టీఆర్ఎస్ ఎంపీ(TRS MPs)లు పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు. కానీ బీజేపీ ఎంపీల తీరు ఇందుకు భిన్నంగా ఉందన్నారు. పేద ప్రజ‌ల కోసం కేవలం టీఆర్ఎస్ మాత్రమే పోరాడుతుందన్నారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగ‌తి సాధించిందన్నారు. 

కేంద్ర బ‌డ్జెట్‌(Budget)లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తే బీజేపీ నేతలు ఇప్పటి వరకూ సమాధానం చెప్పలేదన్నారు. మాయ‌మాట‌లు చెప్పడం, మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టడం, రైతుల‌ను, పేద‌ల‌ను మోసం చేయ‌డంలో బీజేపీ నంబ‌ర్ వ‌న్ అని క‌విత విమర్శించారు. మాయ‌మాట‌లు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ స‌హ‌నాన్ని, మంచిత‌నాన్ని చేత‌గాని తనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. దిల్లీ దాకా వ‌చ్చి బీజేపీ సంగ‌తేంటో చూస్తామని ఎమ్మెల్సీ క‌విత హెచ్చరించారు.

Also Read: Karimnagar: బీజేపీలో రహస్య సమావేశాల కలకలం, కరీంనగర్ సీనియర్ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి!

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ- గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ- గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
Harish Rao: ఢిల్లీలో తెలంగాణ హక్కుల కోసం నిలదీయండి.. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ డిమాండ్లు ఇవే
ఢిల్లీలో తెలంగాణ హక్కుల కోసం నిలదీయండి.. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ డిమాండ్లు ఇవే
Telangana Congress InCharge: మీనాక్షి నటరాజన్ ఔట్.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా BM Sandeep- ఇంతకీ ఎవరీయన
మీనాక్షి నటరాజన్ ఔట్.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా BM Sandeep నియామకం- ఇంతకీ ఎవరీయన
Rahul Gandhi: దేశంలో ఫాసిస్టులు ఆగడాలు పెరిగిపోయాయ్.. భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
దేశంలో ఫాసిస్టులు ఆగడాలు పెరిగిపోయాయ్.. భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ దోపీడీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ దోపీడీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
SpaceX Starship Flight 15: అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
Tiger Tension: ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
Tirupati Crime News: అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
Andhra Pradesh Rains: ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Embed widget