అన్వేషించండి

IT Raids In Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రెయిడ్స్ కలకలం - ఒకే సారి 20 చోట్ల సోదాలు !

హైదరాబాద్‌లో మరోసారి పెద్ద ఎత్తున ఐటీ సోదాలు చేస్తున్నారు. ఈ సారి టైర్ 2 కంపెనీలపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది.

IT Raids In Hyderabad   :   తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలే లక్ష్యంగా ఏకకాలంలో 20 చోట్ల అధికారులు రైడ్స్ చేశారు. దిల్ సుఖ్ నగర్ లోని గూగి రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు . గూగి రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యాలయంతో పాటు ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ వంటి కంపెనీల్లో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడిన 20 మంది అధికారులు రియల్ ఎస్టేట్ కార్యాలయాలే టార్గెట్ గా రైడ్స్ నిర్వహిస్తున్నాయి. 

గతంలో బడా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు                  

ఈ కంపెనీలకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయా లేవా అన్న వివరాలు బయటకు రాలేదు.అయితే ఈ కంపెనీలేవీ వందలు, వేల కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాలు నిర్వహించేంత పెద్దవి కావని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా బ్లాక్ మనీ ప్రవహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్లాట్ల కొనుగోలు విషయంలో ఈ బ్లాక్ మనీ ఎక్కువగా చలామణి అవుతుంది. ప్రభుత్వ  రేటు ప్రకారం రిజిస్ట్రేషన్లు చేస్తారు. కానీ మార్కెట్ ధర అంతకంటే ఎంతో ఎక్కువ ఉంటుంది. మార్కెట్ ధర మాత్రమే డాక్యుమెంట్‌లో చూపించి మిగతా మొత్తం నగదు రూపంలో తీసుకుంటారు. అదంతా  బ్లాక్ మనీగానే భావిస్తున్నారు. అందుకే పొలాల్ని ప్లాట్లుగా మార్చే రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ఐటీ అధికారులు గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. 

ఇప్పుడు భూముల క్రయవిక్రయాల్లో ఉన్నకంపెనీలపై ఐటీ దృష్టి...              

హైదరాబాద్‌లో చాలా రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రాజధానిలో ప్రతి బడా రియల్ ఎస్టేట్ కంపెనీపైనా ఐటీ దాడులు జరిగాయి. మాదాపూర్ తో పాటు ఔటర్ చుట్టూ పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్న కంపెనీలు.. వేల కోట్ల టర్నోవర్ నిర్వహిస్తూ ఉంటాయి. ఈ కంపెనీలన్నింటిలోనూ ఇప్పటికే సోదాలు పూర్తయ్యాయి. ఇప్పుడు వాటి కంటే చిన్న కంపెనీలపై గురి పెట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే ఎంత బడా కంపెనీపై దాడులు... చేసిన రోజుల తరబడి సోదాలు చేసినా.. అసలు ఆయా కంపెనీల్లో ఎన్ని అవకతవకలు బయటపడ్డాయన్న విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 

రియల్ ఎస్టేట్‌లో చలామణి అయ్యే  బ్లాక్ మనీపై దృష్టి పెట్టారా ?        

సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అదీ కూడా కాస్త పెద్ద వెంచర్లు అయితే రాజకీయ నాయకుల ప్రమేయం ఖచ్చితంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. గూగి రియల్ ఎస్టేట్ కంపెనీ వెనుక కూడా కొంత మంది నేతలున్నారని భావిస్తున్నారు. ఇయితే ఇలాంటి కంపెనీలతో ఆయా నేతల వ్యాపారం నేరుగా ఉండదు కాబట్టి ఇప్పటి వరకూ ఎరూ బయటపడలేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఈ ఐటీ దాడులు సహజంగానే సంచలనం అవుతున్నయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
KTR: కేసీఆర్ స్కీంలతో పాటు వైఎస్సార్ పథకాలను రద్దు చేస్తారా? జీవో 7పై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
కేసీఆర్ స్కీంలతో పాటు వైఎస్సార్ పథకాలను రద్దు చేస్తారా? జీవో 7పై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
Karimnagar Robbery: కరీంనగర్‌లో పట్టపగలే దోపిడీ.. జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన గ్యాంగ్
కరీంనగర్‌లో పట్టపగలే దోపిడీ.. జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి బంగారం ఎత్తుకెళ్లిన గ్యాంగ్
Telangana Rains: తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు
తెలంగాణలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు.. ఏపీలో 124 మండలాల్లో వడగాల్పులు

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష బహుమతి .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Karuppu: పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
పొలిటికల్ ఎఫెక్ట్ వద్దనుకుని... త్రిషను దూరం పెడుతున్న సూర్య టీమ్?
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
IPL 2026 KKR VS SRH Result Update: బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
Dating Trend : అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Bandla Ganesh Daughter Engagement : బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
Embed widget