IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !
మల్లారెడ్డి కుటుంబీకులను ఐటీ అధికారులు ప్రశ్నించారు. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడికి ప్రత్యేకంగా ఓ ఫార్మాట్ ఇచ్చి ఆ ప్రకారం వివరాలు ఇవ్వాలని ఐటీ అధికారులు ఆదేశించారు.
IT Politics : పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులో మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డితో సహా.. మొత్తం 12 మందిని ఐటీ అధికారులు విచారించారు. మల్లారెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి సహా 12 మంది హాజరయ్యారు. ఐటీ విచారణకు వచ్చిన వారిలో MLRIT కాలేజీ ఛైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన శివకుమార్ రెడ్డి, నర్సింహారెడ్డి, త్రిశూల్ రెడ్డి, మెడికల్ కాలేజీ డైరెక్టర్ రామస్వామిరెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ మాధవి.. మెడికల్ కాలేజీ అకౌంటెంట్, ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, మల్లారెడ్డి ఎడ్యుకేషన్ గ్రూప్ కు చెందిన ఇద్దరు అకౌంటెంట్స్ కూడా ఐటీ విచారణకు హాజరయ్యారు. భద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలను ఐదు గంటల పాటు విచారణ చేసి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు ఐటీ అధికారులు.
నిర్దేశించిన ఫార్మాట్‌లో సీట్లు, ఫీజుల వసూలు వివరాలు
ఇంజనీరింగ్ ,మెడికల్ కళాశాలల సీట్లు కేటాయింపులు ,ఫీజు వసూలు పై వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఐటి అధికారులు ఇచ్చిన ఫార్మేట్ లోనే వివరాలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఐటి అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ మేము సమాధానాలు చెప్పామని.. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారణ చేశారని.. అవసరమనుకుంటే మరోసారి విచారణకు రావాలని ఐటి అధికారులు సూచించారన్నారు. తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలపై వివరాలు అడిగారన్నారు. మేము చెప్పిన సమాధానాలతో ఐటి అధికారులు సంతృప్తి చెంది ఉన్నారని మేము భావిస్తున్నామన్నారు. మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందన్నారు. ఇదే కేసులో మరి కొంతమందికి సమాన్లు ఇచ్చి విచారణ చేస్తామని ఐటి అధికారులు తెలిపారని రాజశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు.
అన్ని ప్రశ్నలకూ సమాధానమిచ్చామన్న మల్లారెడ్డి కుమారుడు
మల్లారెడ్డి చిన్న కూమారు చామా కూర భద్రా రెడ్డి కూడా.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చామని ప్రకటించారు. మాతోపాటు కళాశాలల ప్రిన్సిపాల్ మరికొంత మా సిబ్బందిని విచారణ చేశారని.. మా స్టేట్మెంట్లతో పాటు మా కళాశాల సిబ్బంది స్టేట్మెంట్లు రికార్డు చేశారన్నారు. అవసరమనుకుంటే మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారని.. ఇంజనీరింగ్ ,మెడికల్ కళాశాలల ఫీజుల వివరాలు సీట్ల కేటాయింపు వివరాలు సమర్పించాలని ఆదేశించారన్నారు. ఐటి అధికారులు ఇచ్చిన ఫార్మేట్ లోనే వివరాలు ఇవ్వాలన్నారని.. అధికారులు అడిగిన ఫార్మేట్ లో మేము పూర్తి వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
30వ తేదీన మరికొంత మంది విచారణ
ప్రవీణ్ రెడ్డి, మల్లారెడ్డి ,మహేందర్ రెడ్డికి ఇంకా సమన్లు ఇవ్వలేదు...త్వరలో వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని తెలిపారు ...ఐటి అధికారుల విచారణకు మేము అన్ని విధాల సహకరిస్తామని భద్రారెడ్డి తెలిపారు. ఉదయమే.. మర్రి లక్ష్మణ్ రెడ్డి, నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డిని విచారించారు. 30వ తేదీన మరోసారి రావాలని నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డికి ఐటీ అధికారులు సూచించారు. విచారణకు హాజరవుతామని నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డి అన్నారు.