Telangana Inter Board: ఇంటర్ పరీక్షల ఫీజుల తేదీలు ఖరారు.. ఇంప్రూవ్ మెంట్ కూడా రాసుకోవచ్చు...
తెలంగాణలో ఇంటర్ మొదటి, రెండో ఏడాది పరీక్షల ఫీజుల తేదీలను ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. ఈనెల 5 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫీజుల తేదీలను బోర్టు ఖరారు చేసింది. ఫీజు చెల్లించకుంటే.. ఆలస్య రుసుముతో.. ఫిబ్రవరి.. 21 వరకు.. ఫీజు చెల్లించే అవకాశం ఉందని.. ఇంటర్ బోర్డు తెలిపింది.
ఆలస్య రుసుము 100 రూపాయలతో ఈనెల 25 నుంచి 31 వరకు చెల్లించొచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు చెల్లించే అవకాశం ఉంది. రూ.1000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు ఉంటుంది. రూ.2 వేలతో ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. మొదటి సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాసుకునే ఛాన్స్ ఉంది.
ఇటీవల ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో.. మొదటి సంవత్సర పరీక్షల్లో చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో బోర్డుపై విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గిన నేపథ్యంలో పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
కరోనా కారణంగా నేరుగా తరగతులు నిర్వహించకపోవడం.. తొలుత పరీక్షలను రద్దు చేసిన సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేయడం.. ఆ తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించడం వంటి పరిస్థితుల్లో విద్యార్థులు గందరగోళానికి లోనయ్యారని వాదనలు వినిపించాయి.
గతంలో విడుదల చేసిన ఫలితాల్లో.. జనరల్, ఒకేషనల్ కలిపి 49 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. గతేడాదితో పోలిస్తే ఏకంగా 11 శాతం ఉత్తీర్ణత తగ్గడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మొత్తం జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 5.59 లక్షల మందికి 2.24 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి