TRS VIjayaGarjana : విజయగర్జనతోనే టీఆర్ఎస్ మళ్లీ ట్రాక్‌లోకి ! ఇక కేటీఆర్‌దే అసలు టాస్క్ !
హుజురాబాద్ ఉపఎన్నికల్లో డీలా పడిన టీఆర్ఎస్‌ను మళ్లీ ట్రాక్‌లో పెట్టాల్సిన బాధ్యత కేటీఆర్‌పై పడింది. విజయగర్జన సభను నభూతో అన్నట్లుగా నిర్వహించి పార్టీ క్యాడర్‌లో మళ్లీ నమ్మకాన్ని పెంచాల్సి ఉంది.
హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఎదురైన ఘోరపరాజయంతో టీఆర్ఎస్‌లో నిస్తేజం ఆవరించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా .. దళిత బంధు లాంటి పథకం పెట్టినా వర్కవుట్ కాకపోవడంతో సహజంగానే ఆ పార్టీ నేతల్లో భవిష్యత్ భయం ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి పార్టీ క్యాడర్‌ను బయటపడేయడానికి పార్టీ హైకమాండ్‌కు వరంగల్‌లో నిర్వహించాలనుకున్న విజయగర్జన సభ బాగా ఉపయోగపడే అవకాశం ఉంది., అయితే ఇప్పుడు ఆ సభను సక్సెస్ చేయడమే కీలకం. అందర్నీ భాగస్వాములను చేసేలా ఉత్సాహం నింపడమే టీఆర్ఎస్ హైకమాండ్‌కు టాస్క్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.
Also Read : కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టిన.. మీ రుణం తీర్చుకోలేను.. ఉపఎన్నిక ఫలితంపై ఈటల
నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహించాలనుకున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నారు. విజయగర్జన సభకు ఇంచార్జీగా కేటీఆర్‌ను ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ సభను నభూతో అన్నట్లుగా నిర్వహింప చేయాలని డిసైడయ్యారు. ఈ సభ విజయవంతానికి కేటీఆర్ ప్రతి రోజు ఇరవై నియోజవకర్గాల బాధ్యులు, ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. జన సమీకరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
Also Read : ఆ మాజీ సీఎం కుమారుల అడుగులు ఎటువైపు.. టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత లేక కేడర్ అయోమయం...
అయితే అనూహ్యంగా విజయగర్జన సభను హుజురాబాద్ కౌంటింగ్ కంటే ముందే వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. 15వ తేదీకి బదులుగా రెండు వారాలు ఆలస్యంగా 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజు తెలంగాణకోసం కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించిన తేదీ. ఆ రోజున టీఆర్‌ఎస్ ప్రతి ఏడాది దీక్షా దివస్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అదే రోజు సభ నిర్వహించాలని వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు కేసీఆర్‌ను కోరారని.. దానికి ఆయన అంగీకారం తెలిపారని టీఆర్ఎస్ వర్గాలు ప్రకటించారు.
ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను ఈ నెల 29కి మార్చుకోవాలని నిర్ణయించారు. పది లక్షల మందితో విజయనగర్జన నిర్వహించి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు హుజురాబాద్ ఫలితం అనుకున్నట్లుగా రాకపోవడం విజయగర్జనను ఊహించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ముఖ్యనేతలపై పడింది. ముఖ్యంగా విజయగర్జన బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ మరింత చురుగా వ్యవహరించాల్సి ఉంది. ముందు నుంచీ హుజురాబాద్ ఉపఎన్నికను చాలా చిన్న అంశంగా చెబుతూ వస్తున్న కేటీఆర్.. ఫలితం తమపై ఎలాంటి ప్రభావం చూపబోదని రిజల్ట్ వచ్చిన వెంటనే ట్వీట్ చేశారు. దీన్ని ఆచరణలో చూపించాల్సి ఉంది.
Also Read : "ఫలితం" అనుభవించాల్సింది హరీష్ రావేనా !?
అయితే టీఆర్ఎస్‌కు ముందు ముందు పరిస్థితులు అంత సజావుగా ఉండే అవకాశం లేదు. గతంలో బహిరంగసభ ఏర్పాటు చేయాలంటే ఎలాంటి అడ్డంకులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు బహిరంగసభ ఏర్పాటు చేయాలనుకున్న స్థలానికి సంబంధించిన రైతులే అడ్డం తిరుగుతున్నారు. వద్దంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించి విజయనగర్జనను నిర్వహించి .. ఓటమి బాధను మరిపించి పార్టీలో మళ్లీ జోష్ నింపాల్సిన బాధ్యత కేటీఆర్‌పై పడింది.
Also Read: "దళిత బంధు"గా కేసీఆర్‌ను దళితులు గుర్తించలేదా ? నమ్మలేకపోయారా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి