అన్వేషించండి

YS Sharmila: కింద పడిపోయిన వైఎస్ షర్మిల - ఇంటిముందే తోపులాట, ఉద్రిక్తత

తోపులాటలో వైఎస్ షర్మిల కింద పడిపోయారు. ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించడం కోసం ఆమె బయలుదేరేందుకు యత్నించగా.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంగళవారం (మార్చి 28) ఉదయం అక్కడ జరిగిన తోపులాటలో ఆమె కింద పడిపోయారు. ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించడం కోసం ఆమె బయలుదేరేందుకు యత్నించగా.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమెకు వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకు ముందు షర్మిలను బయటకు రానివ్వకుండా పోలీసులు హౌజ్‌ అరెస్టు చేశారు. ఈ క్రమంలో బయటకు వచ్చి వైఎస్‌ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే జరిగిన తోపులాటలో ఆమె కింద పడిపోయారు.

ఆ తర్వాత తనను అక్కడి నుంచి వెళ్లేందుకు వీలు కల్పించాలని షర్మిల డిమాండ్ చేశారు. పోలీసులు అందుకు ఒప్పుకోకపోవడంతో అక్కడే కాసేపు బైఠాయించారు. ఉస్మానియా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవని వైఎస్ షర్మిల విమర్శించారు. 200 కోట్లతో టవర్స్ కడతామని సీఎం తొమ్మిది ఏళ్ల క్రితం చెప్పారని వైఎస్ షర్మిల అన్నారు. ప్రజలకు వైద్యం అందడం లేదని తనకు ఫిర్యాదులు వచ్చాయని, ప్రతిపక్షాలను ఆపడానికి యత్నిస్తూ.. శాంతి భద్రతల సమస్య తలెత్తిందని అంటారా అని షర్మిల అన్నారు.

‘‘నిన్నటి వరకు తెలంగాణ మా తాతల జాగీరు.. నేను తెలంగాణ ముద్దుబిడ్డను.. నాకు తప్ప ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఎవరికి లేదు అని చెప్పుకొన్న దొర గారికి.. దేశాన్ని దోచుకోవాలని కల పడగానే.. దేశ పౌరున్ని అనే సంగతి గుర్తుకువచ్చింది.. దేశ రాజకీయాలు చేయడం గుర్తుకువచ్చింది.. అయ్యా దొర.. మొన్నటి వరకు ఇదే నాలుకతో కదా మాట్లాడింది.. లంకలో పుట్టినోళ్లంతా రావణ సంతతే, ఆంధ్రోళ్లు అంతా తెలంగాణ ద్రోహులేనని ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంది. మరి ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెప్తావు?  ఏం సంజాయిషీ ఇచ్చుకొంటావు? ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు?

నేను తెలంగాణ కోడలినైనప్పటికీ నన్ను ఆంధ్రా ద్రోహి అని మీ పార్టీ వాళ్లు అవహేళన చేసినప్పుడు.. మీకు నేను ఇక్కడి కోడలినని, ఈ దేశ పౌరురాలినని గుర్తుకురాలేదా?  మీకు చెప్పడానికి నోరు రాలేదా? నరం లేని నాలుక వంద అబద్దాలు చెబుతుందన్నట్లు మన దగ్గరికి వస్తే ఒక న్యాయం, మందికైతే ఒక న్యాయమా?’’ అని వైఎస్ షర్మిల వరుస ట్వీట్లు కూడా చేశారు.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Ram Charan : రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' స్టోరీ అది కాదు - అసలు స్టోరీ ఏంటో చెప్పిన కార్తీక్ సుబ్బరాజు
Harish Rao On Mallanna Sagar: మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
మల్లన్న సాగర్ కట్ట దగ్గరలో అక్రమ బ్లాస్టింగ్‌లు.. కూల్చి వేసేందుకు కుట్ర జరుగుతోందా? - హరీష్ రావు
Traffic E-Challans: ఈ-చలాన్లతో ఇబ్బంది పడుతున్నారా? నేషనల్‌ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు.. ఇలా చేయండి
ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? లోక్‌ అదాలత్‌ ద్వారా జరిమానా తగ్గించుకునే ఛాన్స్‌!
AP El Nino Drought Ground Reality: ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
ఎల్‌నినో పొలిటికల్ గేమ్ - ఆంధ్రాలో కరువు లేదంటున్న కేటీఆర్ - రేవంత్‌ను ఇరికించడానికేనా?
Embed widget