అన్వేషించండి

Weather Latest Update: తెలంగాణలోనూ వాయుగుండం ప్రభావం- హైదరాబాద్‌లో వాతావరణం ఎలా ఉందంటే?

Weather Warnings: ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  

Weather Latest News In Telangana And Hyderabad: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తెలంగాణను కూడా భయపెడుతోంది. రెండు రోజుల నుంచి హైదరాబాద్‌తోపాటు చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం తీరం దాటే సమయంలో మరింతగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బంగాళాఖాతంలో కదులుతున్న వాయుగుండం ఇవాళ తీరం దాటనుంది. అందుకే దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ, అతి వర్షాలు పడబోతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

వాయుగుండం ప్రభావంతో మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. కొన్ని జిల్లాలకు ప్రత్యేక అలర్ట్ ప్రకటించారు. ఆ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

Image

9వ తేదీ ఉదయం 10వ తేదీ ఉదయం వరకు... 

ఆరెంజ్ హెచ్చరిక ఉన్న జిల్లాలు:- కుమ‌్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల  

ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు:-  ఆదిలాబాద్, నిర్మల్‌, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో ఊదురు గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.  

హైదరాబాద్‌కు వర్ష సూచన 

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం హైదరాబాద్‌పై కూడా ఉంది. ఆకాశం రెండు రోజుల నుంచి మేఘావృతమై అక్కడక్కడ జోరువానలు పడుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు ఉండబోతుందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. 

Image

సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం 

తెలంగాణలో ఈసారి వర్షాలు లేవని మొన్నటి వరకు అనుకున్నా.. సాధారణం కంటే ఈసారి భారీగా వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. గతానికి కంటే ఈసారి 42 శాతం ఎక్కువ వర్షపాతం పడిందని లెక్కలు చూపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏడు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం రిజిస్టర్ అయ్యింది. మహబూబాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో ఎక్కువ వర్షం కురిసినట్టు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు ఎక్కువ వర్షం కురిసిందని అంటున్నారు. 

Image

Image

Also Read: ఎవరికి తోస్తే వాడు ఓ ట్యూబ్ పెట్టుకుంటాడు - యూట్యూబ్ ఛానెళ్లపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ganesh Immersion Live Updates: కోలాహలంగా సాగుతున్న ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర
కోలాహలంగా సాగుతున్న ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర
Telangana Vimochana Day: నేడే తెలంగాణ విమోచన దినం, ఏటా వివాదం ఎందుకు? ఆ పార్టీలు ఎందుకు గుర్తించట్లేదు?
నేడే తెలంగాణ విమోచన దినం, ఏటా వివాదం ఎందుకు? ఆ పార్టీలు ఎందుకు గుర్తించట్లేదు?
Jagan vs Lokesh: నాణ్యమైన విద్యకు గండి అన్న జగన్ - ఇంతకీ ఏం చదివావో చెప్పాలంటూ లోకేష్ కౌంటర్
నాణ్యమైన విద్యకు గండి అన్న జగన్ - ఇంతకీ ఏం చదివావో చెప్పాలంటూ లోకేష్ కౌంటర్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ganesh Immersion Live Updates: కోలాహలంగా సాగుతున్న ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర
కోలాహలంగా సాగుతున్న ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర
Telangana Vimochana Day: నేడే తెలంగాణ విమోచన దినం, ఏటా వివాదం ఎందుకు? ఆ పార్టీలు ఎందుకు గుర్తించట్లేదు?
నేడే తెలంగాణ విమోచన దినం, ఏటా వివాదం ఎందుకు? ఆ పార్టీలు ఎందుకు గుర్తించట్లేదు?
Jagan vs Lokesh: నాణ్యమైన విద్యకు గండి అన్న జగన్ - ఇంతకీ ఏం చదివావో చెప్పాలంటూ లోకేష్ కౌంటర్
నాణ్యమైన విద్యకు గండి అన్న జగన్ - ఇంతకీ ఏం చదివావో చెప్పాలంటూ లోకేష్ కౌంటర్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Koratala Siva: ఎన్టీఆర్‌కు కాదు, కొరటాలకే అగ్ని పరీక్ష... 'దేవర' రిజల్ట్ దర్శకుడి కెరీర్‌కి చాలా ఇంపార్టెంట్
ఎన్టీఆర్‌కు కాదు, కొరటాలకే అగ్ని పరీక్ష... 'దేవర' రిజల్ట్ దర్శకుడి కెరీర్‌కి చాలా ఇంపార్టెంట్
Viral Video: తిక్క కుదిరింది, చనిపోయినట్ల ప్రాంక్ వీడియో.. అరెస్ట్ చేసిన పోలీసులు
తిక్క కుదిరింది, చనిపోయినట్ల ప్రాంక్ వీడియో.. అరెస్ట్ చేసిన పోలీసులు
Pooja Hegde : ఆఫ్ షోల్డర్ గౌన్​లో పూజా హెగ్డే.. రెడ్ కార్పెట్ లుక్​లో స్టైలిష్​గా ఉంది కదూ
ఆఫ్ షోల్డర్ గౌన్​లో పూజా హెగ్డే.. రెడ్ కార్పెట్ లుక్​లో స్టైలిష్​గా ఉంది కదూ
Comedian Ali: ఆలీ... సినిమాల్లో మళ్లీ బిజీ - 'సండే గర్ల్ ఫ్రెండ్'లో మెయిన్ లీడ్
ఆలీ... సినిమాల్లో మళ్లీ బిజీ - 'సండే గర్ల్ ఫ్రెండ్'లో మెయిన్ లీడ్
Embed widget