News
News
X

Preethi Health Bulletin: ఎక్మోపైనే ప్రీతి - గుండె, కిడ్నీ పనితీరు కొంత మెరుగు, హెల్త్ బులెటిన్ విడుదల

ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లుగా ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. ప్రీతిని సైఫ్ వేధించిన అంశంపై మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతామని ఏసీపీ తెలిపారు.

FOLLOW US: 
Share:

వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అందుకు కారణంగా భావిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. సీనియర్ పీజీ విద్యార్థి డాక్టర్ సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి.  విచారణ చేసిన మట్టెవాడ పోలీసులు సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ ఫోన్‌ను చెక్ చేసిన పోలీసులకు ఛాటింగ్‌లో కొన్ని ఆధారాలు వెలుగు చూశాయి. పోలీసులు సైఫ్‌ఫై ర్యాగింగ్, వేధింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లుగా ఏసీపీ బోనాల కిషన్ తెలిపారు. ప్రీతిని సైఫ్ వేధించిన అంశంపై మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెడతామని ఏసీపీ తెలిపారు. ఇప్పటికే వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అక్కడి పోలీసులతో సమావేశం అయి మొత్తం వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తుండడంతో కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం హాస్పిటల్ వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

డాక్టర్ ప్రీతి మెడికల్ బులెటిన్ విడుదల 

" డాక్టర్ ప్రీతి ECMO, వెంటిలేటర్, డయాలసిస్ (CRRT) పై ఉన్నారు. రోగి గుండె, కిడ్నీ పనితీరు పరంగా కొంత మెరుగుదల కనిపిస్తోంది. కార్డియాక్ అవుట్‌పుట్, కాంట్రాక్టిలిటీ మెరుగుపడతాయి. నాడీ సంబంధిత పనితీరు ప్రతిస్పందిస్తోంది. ఆమెకు వెంటిలేటర్‌ పెట్టడం వల్ల ఆక్సిజన్ బాగా అందుతుంది. స్పెషలిస్ట్ డాక్టర్ల మల్టీడిసిప్లినరీ బృందం పర్యవేక్షణలో ఆమెకు వైద్యం జరుగుతోంది. ఆమె ఆరోగ్యం మెరుగుదల కోసం అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి "
-- మెడికల్ సూపరింటెండెంట్, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

ప్రస్తుతం ప్రీతిని వరంగల్‌ నుంచి హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఆమెకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నారు. న్యూరాలజీ, జనరల్‌ ఫిజీషియన్‌, కార్డియాలజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. డాక్టర్‌ ప్రీతిని తమ దగ్గరకు తీసుకొచ్చేటప్పటికే పలు అవయవాలు పనిచేయడం లేదని, ఆమెను వెంటిలేటర్‌ సపోర్ట్‌తో తరలించినట్లు నిమ్స్‌ వర్గాలు నిన్న ఓ ప్రకటనలో తెలిపాయి. 

గవర్నర్ పరామర్శ
నిమ్స్‌లో డాక్టర్‌ ప్రీతిని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ గురువారం పరామర్శించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ‘‘ఇది చాలా బాధాకర పరిస్థితి. ఒక డాక్టర్‌గా నేను పరిస్థితిని అర్థం చేసుకోగలను’’ అని వ్యాఖ్యానించారు. వైద్యులు చేయాల్సిందంతా చేస్తున్నారని.. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమని అన్నారు. గవర్నర్‌ పరామర్శకు వచ్చిన సందర్భంలో ప్రీతి తల్లిదండ్రులు బోరున విలపించారు. తమకు న్యాయం చేయాలని గవర్నర్‌ను వేడుకున్నారు.

Published at : 24 Feb 2023 11:35 AM (IST) Tags: NIMS Hospital Governor Tamilisai Health bulletin Warangal Medical student Doctor Preethi

సంబంధిత కథనాలు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Ambedkar Statue: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలేంటో తెలుసా?

Ambedkar Statue: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలేంటో తెలుసా?

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

Balakrishna About NTR: నా తండ్రి ఎన్టీఆర్ కు మరణం లేదు, రాజకీయాల్లో విప్లవం తెచ్చారు: బాల‌కృష్ణ

Balakrishna About NTR: నా తండ్రి ఎన్టీఆర్ కు మరణం లేదు, రాజకీయాల్లో విప్లవం తెచ్చారు: బాల‌కృష్ణ

టాప్ స్టోరీస్

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Priyanka Chopra Comments on RRR: ‘ఆర్ఆర్ఆర్’ తమిళ సినిమా అట, ప్రియాంక చోప్రాను తిట్టిపోస్తున్న జనం

Priyanka Chopra Comments on RRR: ‘ఆర్ఆర్ఆర్’ తమిళ సినిమా అట, ప్రియాంక చోప్రాను తిట్టిపోస్తున్న జనం