అన్వేషించండి

Telangana News: తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు గుడ్ న్యూస్- రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ డబుల్

Anganwadi Staff Benefits: తెలంగాణలో పని చేస్తున్న అంగన్‌వాడీలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి సీతక్క. ఆర్థిక శాఖ ఓకే చెప్పిన మరుక్షణం నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబుల్ అవుతాయని ప్రకటించారు.

Telangana: తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. అంగన్వాడీ టీచర్లకు రిటైర్ అయ్యే టైంలో ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలను రెట్టింపు చేస్తామన్నారు. ఇకపై వారికి రూ.2 లక్షలు ఇస్తామని తెలిపారు. అంగన్ వాడీ కార్యకర్తలకు ప్రస్తుతం రూ.50 వేలు ఇస్తున్నామి ఇకపై వారికి రూ.లక్ష అందిస్తామని పేర్కొన్నారు. 

ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూపులు

అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ పెంపునకు సంబంధిన ప్రతిపాదలను ఇప్పటికే ఆర్థికశాఖకు పంపించామని సభలో సీతక్క వెల్లడించారు. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పెంపు ఉత్తర్వులు జారీ చేసి బెనిఫిట్స్‌ను అమలు చేస్తామని తెలిపారు. 

ఈ మధ్యే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల  పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచినట్టు ప్రకటించింది. సిబ్బంది పుట్టిన తేదీని పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా టీసీ లేదా మార్కుల మెమో ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ధ్రువీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి జారీ చేసిన బోన్ డెన్సిటోమెట్రీ నివేదిక లేదా మెడికల్ సర్టిఫికేట్‌ను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. 

ఇప్పుడు పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు 2 లక్షలు, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకాలు ఇస్తామని తాజాగా చెప్పింది. సర్వీసులో ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ మరణిస్తే రూ.20 వేలు, మినీ అంగన్‌వాడీ టీచర్‌/హెల్పర్‌కు రూ.10 వేలు దహన సంస్కారాల కోసం అందజేయనున్నామని తెలిపారు. పదవీ విరమణ చేసిన వారికి ఆసరా పింఛన్లు కూడా మంజూరు చేస్తామని గతంలోనే హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగ‌న్వాడీ కేంద్రాల స్థాయిని కూడా పెంచారు. 

గత ప్రభుత్వ నిర్ణయమే..
తెలంగాణ ఏర్పడిన తర్వాత అంగన్‌వాడీ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచేలా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు మూడుసార్లు వేతనాలను పెంచింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచారు. పదవీ విరమణ సమయంలో ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఇచ్చే నగదును ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి పెంచింది. 50 ఏళ్ల లోపు వయసున్న వారికి రూ.2 లక్షల బీమా, 50 దాటిన వారికి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని కూడా అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్లకు రూ.13,650, మినీ టీచర్లు రూ.7,800లు, హెల్పర్లు రూ.7,800 వేతనంగా ప్రభుత్వం ఇస్తోంది. 

దీంతోపాటు తెలంగాణలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగ‌న్వాడీ కేంద్రాల్లో (Anganwadi Centers) టీచ‌ర్లు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. 

Also Read: కాంగ్రెస్ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందని యువకులు చెబితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా- అసెంబ్లీలో కేటీఆర్ సవాల్

Also Read: అక్కలను నమ్మొద్దు, కేటీఆర్‌కు రేవంత్ సూచన- సబితా సీరియస్‌- తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Embed widget