అన్వేషించండి

KTR: ఇండియాకి దేశభాష లేదు, భాష సెలెక్ట్ చేసుకొనే హక్కు ప్రజలదే: కేటీఆర్‌

బీజేపీయేతర రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దవద్దని గట్టిగానే చెబుతున్నాయి.

జాతీయ భాష అంశంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పలు కామెంట్స్ చేశారు. "ఇండియాకి ఎలాంటి జాతీయ భాష లేదు, ఇక్కడ ఉన్న అన్ని అధికారిక భాషల్లో హిందీ ఒకటి మాత్రమే" అని కేటీఆర్ ట్వీట్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దీనిపై తీవ్రస్థాయిలో బీజేపీపై మండి పడ్డ మరుసటి రోజే కేటీఆర్ ఇలా స్పందించారు. ట్విటర్ వేదికగా హిందీ అంశంపై తన అసహనం వ్యక్తం చేశారు. "IITల్లో హిందీని తప్పనిసరి చేయటం ఎన్‌డీఏ ప్రభుత్వ ఫెడరలిజానికి ఉదాహరణ. ఏ భాష ఎంచుకోవాలనే స్వేచ్ఛ ప్రతి భారతీయులందరికీ ఉండాలి. హిందీని బలవంతంగా రుద్దడంపై మేము పూర్తిగా వ్యతిరేకం" అని స్ఫష్టం చేశారు.

కేరళ సీఎం లేఖ
బీజేపీయేతర రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దవద్దని గట్టిగానే చెబుతున్నాయి. కేంద్రం అందరి మీదా "హిందీ" భాషను బలవంతంగా రుద్దాలని చూస్తోందని విమర్శిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే చాలా సార్లు చాలా మంది నేతలు గట్టిగానే స్పందించారు. హిందీ జాతీయ భాష అన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. దక్షిణాది రాష్ట్రాలు హిందీని వ్యతిరేకించడంలో ఎప్పుడూ ముందుంటాయి. అదే క్రమంలో తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇదే విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు.

"కేవలం ఓ భాషను మాత్రమే ఎక్కువగా ప్రమోట్ చేసి, దాన్ని అందరిపైనా బలవంతంగా రుద్దాలన్న ప్రయత్నం మానుకోండి. ఇది సమైక్యతకు వ్యతిరేకం" అని ఆ లేఖలో పినరయి విజయన్ పేర్కొన్నారు. అంతే కాదు. భారత్‌లో "భిన్నత్వంలో ఏకత్వం" ఉందని, దానికి మచ్చ తెచ్చే పనులు మానుకోవాలని హితవు పలికారు. "భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత సంస్కృతి. ఎన్నో ఆచారాలు, భాషలు ఇక్కడ ఉన్నాయి. కేవలం ఓ భాషను వేరే వాళ్లపై రుద్దితే ఆ ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉంది" అని స్పష్టం చేశారు. 

గతంలో తమిళనాడు విద్యామంత్రి కే.పొన్‌ముది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. "హిందీ మాట్లాడే వాళ్లంతా ఎలాంటి నైపుణ్యాలతో పని లేని తక్కువ స్థాయి ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది" అని ఆయన గతంలో వ్యాఖ్య చేశారు. ఆ తరవాత అది సోషల్ మీడియాలోనూ యుద్ధానికి కారణమైంది. కొన్ని వర్గాలు హిందీ భాషకు మద్దతు ఇవ్వగా మరికొన్ని మాత్రం వ్యతిరేకించాయి.

అజయ్ దేవ్‌గణ్ - సుదీప్ మధ్య కొన్ని నెలల క్రితం ట్విటర్ వార్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, కన్నడ నటుడు సుదీప్ కిచ్చ మధ్య కూడా కొద్ది నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడిచింది. "హిందీ జాతీయ భాష కానే కాదు" అన్న సుదీప్ కిచ్చ కామెంట్స్‌ను ఖండిస్తూ అజయ్‌ దేవ్‌గణ్ ట్వీట్ చేశారు. "మై బ్రదర్ కిచ్చ సుదీప్. నీ దృష్టిలో హిందీ అనేది జాతీయ భాష కాకపోతే, మీ కన్నడ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారో చెప్పండి. హిందీ మా మాతృభాష. అది జాతీయ భాష కూడా" అంటూ అజయ్ దేవ్‌గణ్ అప్పట్లో ట్వీట్ చేశారు. అదే సమయంలో కిచ్చ సుదీప్‌కి కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై కూడా మద్దతుగా నిలిచారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget