అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు

Double Bedroom Houses | మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ గతంలో దరఖాస్తు తమకు అన్యాయం చేస్తున్నారని కొందరు వచ్చారు.

Double Bedroom Houses In Hyderabad |  చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ బాధితులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళనకు దిగారు.హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్ వాసులు వణికిసోతున్నారు. చట్టం తన పనిని తాను చేసుకుపోతుంది అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇదివరకే ఒక్కోచోట చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేయడంతో కొందరిలో భయాందోళన నెలకొంది. తమ ఇండ్లను సైతం కూల్చేస్తారని కూకట్ పల్లిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు

కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు అక్రమ నిర్మాణాలకు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న కట్టడాలకు నోటీసులు ఇస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇండ్ల సంఖ్యను గుర్తించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. దాంతోపాటు మూసీ పరివాహక ప్రాంతాల వేరే చోటుకు తరలించారు. ఇందుకోసం ప్రభుత్వం వారిలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అసలే అసలు సమస్య మొదలైంది. ఓవైపు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కంటే, అధికారులు తరలించనున్న మూసీ పరివాహక ప్రాంతాల్లో కుటుంబాలు అధికంగా ఉండనున్నాయి. 

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త చిక్కులు తప్పవా?

మరోవైపు గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం వేలాది దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ పంపిణీ జరగలేదు. కానీ గతంలో దరఖాస్తు చేసుకున్న తమకు కాకుండా, ఇప్పుడు మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని రేవంత్ సర్కార్ చెప్పడం ఉద్రికత్తలకు దారితీసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న తమకు కాకుండా, మూసీ బాధితులకు ఇండ్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రయత్నంలో భాగంగా  చంచల్‌గూడ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం.. పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది, సుద్దపూస మాటలాపి అది కూలగొట్టు: హరీష్ రావు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Embed widget