అన్వేషించండి

Bhatti Vikramarka: భూములన్నీ లాక్కున్నారు, సోమేష్‌ను సలహాదారుగా తీసేయాల్సిందే - భట్టి డిమాండ్

భూ బకాసురులు భూములను ఆక్రమించుకునేందుకు సోమేష్‌ కుమార్ సహాయపడ్డారని ఆరోపించారు. భట్టి విక్రమార్క బుధవారం (మార్చి 10) మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌కు సలహాదారుగా నియమించడంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ఐఏఎస్‌లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే ఆ రాష్ట్రానికి గౌరవంగా వెళ్లి పని చేసుకోవాలని అన్నారు. అంతేకానీ, సోమేష్‌ కుమార్‌ లాంటి వ్యక్తి ఏపీకి వెళ్లకుండా కేసీఆర్‌కు సలహాదారుగా నియమితులు అవ్వడం ఏంటని ప్రశ్నించారు. భూ బకాసురులు భూములను ఆక్రమించుకునేందుకు సోమేష్‌ కుమార్ సహాయపడ్డారని ఆరోపించారు. భట్టి విక్రమార్క బుధవారం (మార్చి 10) మీడియాతో మాట్లాడారు.

పేదలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చి భూములను ధరణి పోర్టల్ పేరుతో లాక్కున్నారని విమర్శించారు. ప్రభుత్వం పేదల భూమిని లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని, ఒక్క ఇ‍బ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 5 లక్షల కోట్ల విలువైన భూములు లాక్కున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కోట్ల విలువైన భూములను లాక్కునే ప్రణాళికలో సూత్రదారి సోమేశ్ కుమార్ అని అన్నారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ సలహాదారుగా నియమించుకున్నారని ఆరోపించారు. 

ఓఆర్ఆర్ లీజుపైనా వ్యాఖ్యలు

ఔటర్ రింగ్ రోడ్డును లీజుకు ఇవ్వడం వెనుక కూడా సోమేష్ కుమార్‌, అరవింద్‌ ఉన్నారని అన్నారు. ఏటా వందల కోట్ల ఆదాయం వచ్చే ప్రాజెక్టును 30 సంవ్సతరాలు లీజుకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఇంత మంది సలహాదారులు ఎందుకని ప్రశ్నించారు. రిటైర్డ్‌ అధికారులతో ప్రభుత్వం నడపాలనుకుంటున్నారా? అని అన్నారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఇరిగేషన్‌ శాఖకు రిటైర్డ్‌ అయిన వ్యక్తిని ఎలా కొనసాగిస్తారని, సోమేష్‌ కుమార్‌ను సలహాదారుగా నియమించడం అంటే.. మళ్లీ దోపిడీని ప్రారంభించినట్టేనని అన్నారు. వెంటనే సోమేష్‌ కుమార్ సలహాదారు పదవిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై విచారణ చేయించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కేసీఆర్‌ లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేస్తామని అన్నారు. సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే హైదరాబాద్‌ చుట్టుపక్కల లక్షల కోట్ల భూములు చేతులు మారాయి. ఇంధిరా గాంధీ, ప్రియాంక గాంధీల గురించి మాట్లాడే అర్హత తలసానికి లేదు. 

కేటీఆర్, తలసానిపైనా వ్యాఖ్యలు

ఉస్మానియా యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీకి వెళ్లి వచ్చే దమ్ము కేటీఆర్‌కు, తలసానికి ఉందా? ఫార్మాసిటీ కట్టాలంటే పేదల భూములు లాక్కోవడం ఎందుకు? గజ్వేల్, సిరిసిల్లలో భూములు లేవా? ప్రభుత్వం బెదిరింపులతో ఎంతకాలం నడుస్తుందని భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
RS Praveen Kumar: బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
Rajamouli Emotional Post: RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Mallareddy vs Mynampally Hanumantha Rao: విద్యార్థులతో రాజకీయాలు చేస్తున్నారని మైనంపల్లిపై ఆరోపణలుSS Rajamouli RRR Japan Visit | జపాన్ RRR స్పెషల్ షో లో రాజమౌళి సందడి | ABP DesamMohan Babu Birthday Celebrations | తండ్రి పుట్టినరోజు వేడుకల్లో భార్యతో కలిసి మంచు మనోజ్ | ABP DesamAP Volunteers YSRCP Campaign in Visakha | విశాఖపట్నంలో వాలంటీర్లతో వైసీపీ ఎన్నికల ప్రచారం |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Costal Politics: వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
వైసీపీ కోటలో టీడీపీ పాగా వేసేనా..? రెడ్డిరాజ్యంలో పట్టు నిలుపుకునేదెవరో..?
Rajamouli On SSMB29: మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
మహేష్ బాబు సినిమా అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
RS Praveen Kumar: బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
బీఆర్ఎస్‌లోకి RS ప్రవీణ్, కండువా కప్పిన కేసీఆర్, 80 మంది బీఎస్పీ నేతలు కూడా
Rajamouli Emotional Post: RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా
Mohan Babu Birthday: 'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
'కలెక్షన్‌ కింగ్‌' మోహన్‌ బాబు బర్త్‌డే - ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలెన్నో తెలుసా?
Seema Politics: ఈసారి సీమ టపాకాయ ఎవరు? పట్టు నిలుపుకొనేందుకు వైసీపీ కసరత్తు, పూర్వవైభవం కోసం టీడీపీ ఎత్తులు
ఈసారి సీమ టపాకాయ ఎవరు? పట్టు నిలుపుకొనేందుకు వైసీపీ కసరత్తు, పూర్వవైభవం కోసం టీడీపీ ఎత్తులు
Weather Latest Update: నేడు ఇక్కడ భారీ వర్ష సూచన! వడగండ్లతో ఆరెంజ్ అలర్ట్ - ఐఎండీ హెచ్చరిక
నేడు ఇక్కడ భారీ వర్ష సూచన! వడగండ్లతో ఆరెంజ్ అలర్ట్ - ఐఎండీ హెచ్చరిక
Mynampally Vs Malla Reddy: మైనంపల్లి రోహిత్ మాస్ వార్నింగ్ - కౌంటర్ ఇచ్చిన మల్లారెడ్డి కుమారుడు
మైనంపల్లి రోహిత్ మాస్ వార్నింగ్ - కౌంటర్ ఇచ్చిన మల్లారెడ్డి కుమారుడు
Embed widget