Jr NTR Amit Shah Meeting: ఎన్టీఆర్ అత్యంత ప్రతిభావంతుడైన నటుడు: తారక్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా ప్రశంసలు
Amit Shah Junior NTR Meeting: టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్‌ను డిన్నర్ మీట్ కు రావాలని అమిత్ షా ఆహ్వానించగా నటుడు వెళ్లారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన చివరి క్షణాల్లో మరో కీలక పరిణామం జరిగింది. టాలీవుడ్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్‌ను డిన్నర్ మీట్ కు రావాలని అమిత్ షా ఆహ్వానించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి షా ఆహ్వానం మేరకు నటుడు ఎన్టీఆర్ శంషాబాద్‌కు వెళ్లారు. నోవా టెల్ హోటల్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్ షా అప్యాయంగా స్వాగతించారు. అమిత్ షా, ఎన్టీఆర్ కలిసి అక్కడే డిన్నర్ చేసినట్లు సమాచారం.
రాజకీయాలు లేవా ?
టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీని కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవల చూశారట. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనను ప్రశంసించడానికే యంగ్ టైగర్‌ను కేంద్ర మంత్రి షా ఆహ్వానించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ మహా నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనవడు కావడంతో రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. కేవలం సినిమాలు, ఎన్టీఆర్ నటనపైనే చర్చ జరిగిందా.. లేదా పొలిటికల్ పాయింట్స్ టచ్ చేశారా అని అటు పొలిటికల్ లీడర్స్‌తో పాటు ఇటు సినీ ఇండస్ట్రీలోనూ తారక్, షా భేటీ హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్టీఆర్‌పై అమిత్ షా ప్రశంసల వర్షం..
టాలీవుడ్ అగ్రహీరోలలో ఒకరైన ఎన్టీఆర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. శంషాబాద్ నోవా టెల్ హోటల్‌లో ఎన్టీఆర్‌తో కలిసి డిన్నర్ చేసిన సందర్భంగా ఆయన నటనను మెచ్చుకున్నారు. ‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది’ అని కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
Had a good interaction with a very talented actor and the gem of our Telugu cinema, Jr NTR in Hyderabad.
— Amit Shah (@AmitShah) August 21, 2022
అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది.@tarak9999 pic.twitter.com/FyXuXCM0bZ
ముందు రామోజీరావుతో.. నెక్ట్స్ తారకరాముడితో..
Amit Shah Meets Ramoji Rao: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలతో రాజకీయాలు వేడెక్కుతున్న సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు. తన పర్యటనలో భాగంగా రామోజీ గ్రూప్ అధినేత, రామోజీ ఫిల్మ్ సిటీ ఫౌండర్ రామోజీరావుతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదివారం సాయంత్రం బీజేపీ నిర్వహించిన సభ అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు అమిత్ షా. కేంద్ర మంత్రికి రామోజీరావు స్వాగతం పలకడంతో పాటు తన నివాసానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ రామోజీరావు, అమిత్ షాలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే ఇది రాజకీయ భేటీ కాదని, మర్యాదపూర్వకంగా ఇద్దరు ప్రముఖులు కలిశారని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. రామోజీరావుతో షా భేటీలో పొత్తుల గురించి చర్చ జరిగిందా, మీడియా సహాయం కోరేందుకు భేటీ అయ్యారా అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Also Read: Amit Shah Meets Ramoji Rao: రామోజీరావుతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ - నేతల్లో పెరిగిన ఉత్కంఠ !
Also Read: మునుగోడు నుంచి అమిత్‌షా ప్రశ్నల వర్షం- కేసీఆర్ ఇచ్చిన హామీల సంగతేంటని నిలదీత