Hyderabad News : శంకర్ పల్లి ఐబీఎస్ కాలేజీ ర్యాగింగ్ ఘటన, 12 మంది విద్యార్థులపై ఏడాది పాటు సస్పెన్షన్!
Hyderabad News : శంకర్ పల్లి ఐబీఎస్ కాలేజీ ర్యాగింగ్ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. 12 మంది విద్యార్థులపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించింది.
Hyderabad News : హైదరాబాద్ శంకర్‌పల్లిలోని ఐబీఎస్ కాలేజీ ర్యాగింగ్ ఘటనలో సంచలనం అయింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు విచక్షణారహింతగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన వీడియోలు వైరల్ కావడంతో విశ్వవిద్యాలయం యాజమాన్యం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దాడికి పాల్పడిన 12 మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. ఈ నెల 1వ తేదీన ర్యాగింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సీనియర్లు దాడికి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు చేస్తే పోలీసులు రాజీ కుదిర్చి పంపినట్టు తెలుస్తోంది. బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ లో ఫిర్యాదు చేయడంతో 12 మంది సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటనపై ఐబీఎస్‌లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ దర్యాప్తు అనంతరం మరికొంత మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రేమ వ్యవహారంతో?
శంకర్‌పల్లి సమీపంలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ఐబీఎస్ కాలేజీ హాస్టల్ విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ యువకుడు, యువతి కొంతకాలంగా లవ్ చేసుకుంటున్నారు. వారు దూరపు బంధువులు కూడా అవుతారు. అయితే కొన్ని రోజుల క్రితం వీరి మధ్య చిన్న మనస్పర్థలు వచ్చాయి. ఈ విషయాన్ని యువతి తన బంధువైన సీనియర్ విద్యార్థికి చెప్పింది. అతడు తన స్నేహితులను వెంటబెట్టుకుని హాస్టల్‌లో ఉన్న యువకుడిపై దాడి చేశారు. ఆ తర్వాత బాధిత యువకుడి స్నేహితులు సీనియర్లపై దాడికి పాల్పడ్డారు. సీనియర్ల దాడిలో గాయపడిన ఓ విద్యార్థికి హాస్టల్ లోనే చికిత్స చేశారు. హాస్టల్లో విద్యార్థులు ఘర్షణ పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి IBS కాలేజిలో చదువుతున్నారా లేకపోతే మతం ముసుగులో అరాచకాలు చేస్తున్నారా??@hydcitypolice @cyberabadpolice pic.twitter.com/HNsatGlTpO
— Poola Santosh (@santosh_poola) November 11, 2022
హైదరాబాద్ శంకరపల్లి ఐబీఎస్ కాలేజీలో ర్యాగింగ్ కల్చర్ పేరిట సీనియర్ విద్యార్థులు రెచ్చిపోయారు. జూనియర్ పై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. సీనియర్ల పేరిట జూనియర్ విద్యార్థిపై ఇష్టం వచ్చినట్లు ర్యాగింగ్ చేసి, బూతులు తిడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐబీఎస్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ పేరిట దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో ఓ విద్యార్థి హాస్టల్ రూంలోకి వచ్చిన సీనియర్లు జూనియర్ చిత్రహింసలు పెడుతూ రక్తం వచ్చేలా దాడికి పాల్పడ్డారు. ఈ వీడియోలో కొంత మంది సీనియర్లు, జూనియర్ పై దాడి చేశారు. ఆ యువకుడిపై కూర్చుని దారుణంగా తన్నుతూ, బూతులు తిడుతూ, దాడి చేశారు. పక్కనున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులను టాగ్ చేస్తూ ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు.
Also Read : IAS Dance Video: స్టెప్పులతో ఇరగదీసిన యువ ఐఏఎస్, జగిత్యాల అదనపు కలెక్టర్ డ్యాన్స్ అదుర్స్