News
News
X

IAS Dance Video: స్టెప్పులతో ఇరగదీసిన యువ ఐఏఎస్, జగిత్యాల అదనపు కలెక్టర్ డ్యాన్స్ అదుర్స్

IAS Makarandu Manda Dance Video: గతంలో తన కాలేజీ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మంద మకరందు చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

FOLLOW US: 
 
IAS Makarandu Manda Dance Video: సోషల్ మీడియా వచ్చాక ఇంటర్నెట్ వాడకం మామూలుగా లేదు. ఇప్పుడు చేసిన పనులే కాదు, గతంలో చేసిన విషయాలు సైతం ట్రెండింగ్ లోకి వచ్చేస్తాయ్. నటీనటులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్, ఇలా పలు రంగాలకు చెందిన వారు ఏం చేసినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి వీడియోలు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువ ఐఏఎస్ చేసిన బ్రేక్ డ్యాన్స్ వీడియోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. గతంలో తన కాలేజీ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మంద మకరందు చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చదువులో టాపర్, డ్యాన్స్‌లోనూ యమ యాక్టివ్ 
కాలేజీ రోజుల్లో యువ ఐఏఎస్ మకరంద్ చాలా యాక్టివ్‌ గా ఉండేవారని ఈ వీడియోలు చూస్తే తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల కి చెందిన మంద మకరంద్ ఇటీవల జగిత్యాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అటు చదువులో శ్రద్ధ కనబరిచి టాప్ ర్యాంకులు సాంతం చేసుకుంటూ రాణిస్తూనే మంద మకరంద్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయన ప్రేమికుడు సినిమాలోని ప్రభుదేవా మాస్టర్ పీస్ ముక్కాల ముక్కాబుల పాటకు తోటి విద్యార్థినితో కలిసి స్టేజీపై ఎంతో అలవోకగా వేసిన బ్రేక్ డ్యాన్స్ స్టెప్పుల వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. 

బుట్ట బొమ్మ పాటకు సైతం యువ ఐఏఎస్ క్రేజీ డ్యాన్స్ వైరల్ 
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన అల వైకుంఠపురములో.. సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ బుట్ట బొమ్మ సాంగ్ కి  స్టెప్పులు వేశారు. కాలేజీ రోజుల్లో ఆయన చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ లోనూ తగ్గేదే లే అనేలా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యువ ఐఏఎస్ గతంలో అటు చదువులో రాణిస్తూనే డ్యాన్స్ ని ప్రాక్టీస్ చేసిన వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలు స్థానికంగా వైరల్ అవుతున్నాయి. జిల్లా వాసులు షేర్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన మంద మకరంద్ సివిల్స్ లో 110వ ర్యాంకు సాధించారు. జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మంద మకరందు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. 
యువ ఐఏఎస్, జగిత్యాల అడిషనల్ కలెక్టర్ డ్యాన్స్ వీడియో ఇక్కడ వీక్షించండి

Published at : 12 Nov 2022 12:26 PM (IST) Tags: Telangana Jagtial Viral Video Makarandu Manda IAS Makarandu Manda

సంబంధిత కథనాలు

Mahabubnagar Crime : చిన్నారిపై బాబాయ్ లే అత్యాచారం, ఆపై హత్య!

Mahabubnagar Crime : చిన్నారిపై బాబాయ్ లే అత్యాచారం, ఆపై హత్య!

Karimnagar: జోరు పెంచిన అన్నదాతలు - కాలువ నీటి రాకతో పెద్ద ఎత్తున వరి నాట్లు

Karimnagar: జోరు పెంచిన అన్నదాతలు - కాలువ నీటి రాకతో పెద్ద ఎత్తున వరి నాట్లు

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న

Jeevan Reddy: సోనియా గాంధీ, రాహుల్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు, కవిత విచారణ ఇంట్లో ఎందుకు?: కాంగ్రెస్ ఎమ్మెల్సీ సూటిప్రశ్న

Breaking News Live Telugu Updates: మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం- బాలికపై బాబాయ్ హత్యాచారం

Breaking News Live Telugu Updates: మహబూబ్‌నగర్‌ జిల్లాలో దారుణం- బాలికపై బాబాయ్ హత్యాచారం

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?