Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు - ఈసారి ఎందుకంటే?
Hyderabad News: ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయన కిమ్స్ ఆస్పత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
Hyderabad Police Notice To Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు (Allu Arjun) రాంగోపాల్‌పేట్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయన కిమ్స్ ఆస్పత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు ముందుగా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి బన్నీ మేనేజర్ కరుణాకర్‌కు నోటీసులు అందించారు. కాగా, ఆదివారం సైతం అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావొద్దని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయన ఆస్పత్రికి వస్తున్నారన్న సమాచారంతో నోటీసులిచ్చారు. బెయిల్ షరతులు పాటించాలని.. పరామర్శకు వస్తే తగు సూచనలు పాటించాలన్నారు. ఏదైనా జరిగితే ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
కాగా, ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ థియేటర్‌కు రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన్ను ఏ11గా చేర్చారు. అనంతరం అరెస్ట్ చేయగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. పోలీస్ విచారణకు సహకరించాలని.. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్‌లో హాజరు కావాలని.. సాక్షులను ప్రభావితం చెయ్యొద్దంటూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Also Read: Ram Charan on Fans Death: అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం