అన్వేషించండి

Hyderabad News : మలక్ పేట్ ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆరోపణ!

Hyderabad News : హైదరాబాద్ మలక్ పేట్ ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింతలు ప్రాణాలు కోల్పోయారని బంధువులు ఆరోపిస్తున్నారు.

Hyderabad News : హైదరాబాద్ మలక్ పేట్ ఏరియా హాస్పిటల్ లో దారుణ ఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు బాలింతలు మృతి చెందారు. డెలివరీ కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందారు. నిర్లక్ష్యంగా డెలివరీ చేయడంతోనే బాలింతలు మృతి చెందారని బంధువుల ఆందోళన చేశారు. బాలింతరాలు సిరివెన్నెలకు డెంగ్యూ ఉన్నా వైద్యులు గుర్తించలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. డెంగ్యూతో బాధపడుతున్నా డెలివరీ చేశారని ఆరోపించారు. ప్లేట్ లెట్స్ పడిపోవడంతో సిరివెన్నెలను హుటా హుటిన గాంధీ ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ ఆమె చనిపోయిందని తెలిపారు.  మరో ఘటనలో శివానీ అనే బాలింత మృతి చెందింది. డెలివరీ  సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శివానీ చనిపోయిందని బంధువుల ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం  చేయాలని బంధువుల డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన వైద్యుల పై చర్యలకు తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నారు. బంధువుల ఆందోళనతో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 

అసలేం జరిగింది?

నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన మహేశ్‌ తన భార్య సిరివెన్నెల (23)తో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. మహేశ్‌ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య సిరివెన్నెలను కాన్పు కోసం ఇటీవల మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిరివెన్నెలకు వైద్యులు ఆపరేషన్ చేయగా, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత సిరివెన్నెల అస్వస్థతకు గురికావడంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిరివెన్నెల మరణించింది. మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంగానే సిరివెన్నెల చనిపోయిందంటూ బంధువుల ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని చాదర్‌ఘాట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మరో ఘటనలో తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జగదీశ్‌, తన భార్య శివాణిని ఈ నెల 9న మలక్‌పేట్‌ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో శివాని మగబడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించగా.. ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివాని మృతిచెందింది.  

వైద్యుల నిర్లక్ష్యం లేదు- డీసీహెచ్‌ఎస్‌  

అయితే ఈ ఘటనలపై డీసీహెచ్ఎస్ సునీత స్పందించారు. సిరివెన్నెలను రెండో కాన్పు కోసం ఈ నెల 9న ఆస్పత్రికి తీసుకొచ్చారని. 11న కాన్పు చేశారని తెలిపారు. డెలివరీకి ముందు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి లోపాలు కనిపించలేదన్నారు. 12వ తేదీన సిరివెన్నెల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందంటే ఆమెను వెంటనే గుండె సంబంధిత వైద్యులను సంప్రదించాల్సిందిగా సూచించామన్నారు. దీంతో వైద్యులు వెంటనే ఆమెను గాంధీకి రిఫర్‌ చేశారన్నారు. గాంధీలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి సిరివెన్నెల ప్రాణాలు కోల్పోయారని, ఈ ఘటనపై విచారణ చేస్తామన్నారు. మరో ఘటనలో శివాని డయేరియా సమస్యతో ఇటీవల ఆస్పత్రిలో చేరారని తెలిపారు. శివానికి హైపోథైరాయిడ్‌ సమస్య ఉందన్నారు. ఆమెకు నొప్పులు రావడంతో ఈ నెల 11న కాన్పు చేశారన్నారు. గురువారం రాత్రి శివాని మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో వైద్యుల సూచనతో గాంధీకి రిఫర్ చేశామన్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున శివాని మృతి చెందిందని డీసీహెచ్‌ఎస్‌ సునీత తెలిపారు. బాలింతల మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని ఆమె అంటున్నారు.  ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ కోసం ఒక బృందాన్ని కమిషనర్‌ నియమించినట్లు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun News: నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
Allu Arjun News: నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
Letter To CM Chandrababu: వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Rishabh Pant Stunning Fifty: రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో పంత్ ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP DesamGame Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun News: నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
Allu Arjun News: నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే
Letter To CM Chandrababu: వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
వైసీపీ హయాంలో అక్రమ భూ రిజిస్ట్రేషన్లు, దారుణాలు జరిగాయంటూ చంద్రబాబుకు మాజీ ఉద్యోగి లేఖ
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Rishabh Pant Stunning Fifty: రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో పంత్ ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
రిషభ్ రపారపా.. కంగారూ బౌలర్ల ఊచకోత.. స్టన్నింగ్ ఫిఫ్టీతో ఎదురు దాడి.. 145 లీడ్ లో టీమిండియా 
Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఒక్కడే 'గేమ్ చేంజర్'... మరొక ముఖ్య అతిథి లేరు, ఇంకెవర్నీ పిలవలేదు
పవన్ కళ్యాణ్ ఒక్కడే 'గేమ్ చేంజర్'... మరొక ముఖ్య అతిథి లేరు, ఇంకెవర్నీ పిలవలేదు
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్.. ఫిఫ్టీ దాటిన లీడ్
AP Land Scam: వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిలపై సంచలన ఆరోపణలు
వైసీపీ హయాంలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిలపై సంచలన ఆరోపణలు
Embed widget