Cloud Burst : ఒక దేశం మరొక దేశంలో క్లౌడ్ బరస్ట్ చేయవచ్చా? కేసీఆర్ కామెంట్స్ ఎంత వరకు కరెక్ట్?
Cloud Burst : గోదావరి వరదల వెనుక విదేశాల కుట్ర ఉందన్న సీఎం కేసీఆర్ అనుమానాలపై జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఇది సాధ్యమా? ఇలా ఒక దేశం మరొక దేశంపై క్లౌడ్ బరస్ట్ చేయవచ్చా? ఇందులో వాస్తవమెంతో తెలుసుకుందాం.
![Cloud Burst : ఒక దేశం మరొక దేశంలో క్లౌడ్ బరస్ట్ చేయవచ్చా? కేసీఆర్ కామెంట్స్ ఎంత వరకు కరెక్ట్? Hyderabad cm kcr cloud burst foreign countries plan what is cloud burst Cloud Burst : ఒక దేశం మరొక దేశంలో క్లౌడ్ బరస్ట్ చేయవచ్చా? కేసీఆర్ కామెంట్స్ ఎంత వరకు కరెక్ట్?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/17/ff2c12cc685b1bee437704ddc20edcea1658066938_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cloud Burst : గోదావరి వరదల వెనుక విదేశీ కుట్ర కోసం ఉందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలం అవుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. క్లౌడ్ బరస్ట్ అనే విధానంతో ఇతర దేశాల వాళ్లు మన దేశంలో అక్కడక్కడ ఈ పని చేసి ఉంటారని ఆరోపించారు. కావాలనే పని చేసి ఉన్నారని, కశ్మీర్ లో లద్దాఖ్, లేహ్ తర్వాత ఉత్తరాఖండ్‌లోనూ క్లౌడ్ బరస్ట్ చేశారన్నారు. ఈ మధ్య గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోనూ క్లౌడ్ బరస్ట్ చేశారనే సమాచారం వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. క్లౌడ్ బరస్ట్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. నిజంగా క్లౌడ్ బరస్ట్ చేయవచ్చా? కేసీఆర్ కామెంట్స్ ఎంత వరకూ కరెట్ అనే అంశంపై చర్చ జరుగుతోంది.
క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటో తెలుసా?
తక్కువ ప్రాంతంలో భారీ స్థాయిలో వరదలు రావడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక ప్రాంతంలో అంటే ఒకటి నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఎక్కువ వర్షం పడడడం, పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒకే ప్రాంతంలో ఎన్నిసార్లు అయినా క్లౌడ్ బరస్ట్ జరగొచ్చు. అది భౌగోళిక, వాతావరణ పరిస్థితి మీద ఆధార పడి ఉంటుంది. అంతే కానీ ఒక దేశంపై ఇంకో దేశం క్లౌడ్ బరస్ట్ చేసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక దేశంపై ఇతర దేశాలు కుట్రలు చేయడం వల్లే రాష్ట్రాలల్లో వరదలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. దానిని క్లౌడ్ బరస్ట్ గా ఆయన అభివర్ణించారు. అయితే మే నుంచి ఆగస్టు వరకు దేశంలో క్లౌడ్ బరస్ట్ ఘటనలు జరిగే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతుంటాయి.
సౌత్ ఇండియాలో నో ఛాన్స్
రుతుపవనాలు దక్షిణాన ఉండే అరేబియా సముద్రం నుంచి కొంత తేమ తీసుకొస్తున్నాయి. అలాగే వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా మధ్యధరా తీరం నుంచి వీచే గాలులు పశ్చిమాన ఇరాన్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ నుంచి తేమను తీసుకొస్తాయి. ఈ రెండు ఢీ కొన్నప్పుడు ఏర్పడిన మేఘాలకు ఎక్కువ సాంద్రత ఉంటుంది. దీని వల్ల తక్కువ సమయంలో భారీ వర్షం పడుతుంది. కొండ ప్రాంతాల్లో మాత్రమే ఈ తరహా క్లౌడ్ బరస్ట్ జరుగుతాయి. దక్షిణ భారతదేశంలో మాత్రం ఇటువంటి ఘటనలకు అవకాశం లేదని వాతావరణ శాఖ అంటోంది. దీన్ని బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు క్లౌడ్ బరస్ట్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)