X
Match 9 - 21 Oct 2021, Thu up next
BAN
vs
PNG
15:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 10 - 21 Oct 2021, Thu up next
OMA
vs
SCO
19:30 IST - Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman
Match 11 - 22 Oct 2021, Fri up next
NAM
vs
IRE
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Match 12 - 22 Oct 2021, Fri up next
SL
vs
NED
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi

Harish Rao : త్వరలో రెడ్డి కార్పొరేషన్ .. హుజూరాబాద్‌లో హరీష్ హామీ !

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హుజురాబాద్‌లో హరీష్ రావు హామీ ఇచ్చారు. బీజేపీ గెలిస్తే హుజురాబాద్‌కు ఏం వస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు.

FOLLOW US: 

హుజురాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు కానీ రాజకీయ పార్టీలు మాత్రం ప్రచారాన్ని జోరుగానే కొనసాగిస్తున్నాయి. టీఆర్ఎస్  బాధ్యతలు తీసుకున్న హరీష్ రావు సామాజికవర్గాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా రెడ్డి సామాజికవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. హుజూరాబాద్ లో జరిగే ఎన్నిక న్యాయానికి - అన్యాయానికి, ధర్మానికి - అధర్మానికి మధ్య జరిగే ఎన్నికగా తేల్చారు. రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం  ఏం చేసింది... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది ఆలోచించి ఓట్లేయాలని సమావేశంలో పాల్గొన్న వారికి సూచంచారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిందని.. అలాగే రైతు బంధు, రైతు బీమాను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చేశామని.. రైతుల కోసం రైతు వేదికలు కట్టించామన్నారు. 

Also Read : క్షమాపణ చెప్పిన జగ్గారెడ్డి - టీ కాంగ్రెస్‌లో సద్దుమణిగిన వివాదం

బీజేపీ ప్రభుత్వం బోర్లకు మీటర్లు పెట్టమని చెబుతోందన్నారు. డీజీల్ రేట్లు పెంచడం ద్వారా ఒక్క ఎకరా వ్యవసాయం చేయడానికి ఐదు వేల రూపాయలు భారం పడేలా చేసిందని హరీష్ గుర్తు చేశారు. రైతుల సంక్షేమం కోసం పని చేసే తెరాస గెలవాలా..  కోతలు, వాతలు పెట్టే బీజేపీ గెలవాలా ఆలోచించాలన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి పక్క ఊళ్ల నుంచి జనాలను తెచ్చారని ఈటల అంటున్నారని.. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో రాజేందర్ మాటల్లో నిజం అంతే ఉంటుందని సెటైర్ వేశారు.  భోజనం కోసం, మందు కోసం వస్తున్నారని ఆరోపిస్తూ హుజూరాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ఈటల మాట్లాడుతున్నారన్నారు.  రాజేందర్ ను చిత్తు చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 

Also Read : కరోనా మరణాలకు పరిహారం ! లెక్కల్లో వేయని వారి కుటుంబాలు అన్యాయమైపోయినట్లేనా..!?

ఈటల స్వార్థం కోసం పార్టీ మారారని..  బీజేపీ  ఏ రకంగా హుజూరాబాద్ ప్రజలకు మేలు చేస్తోందో చెప్పాలని సవాల్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, చేతనైతే హుజూరాబాద్ కు వెయి కోట్ల ప్యాకేజీ  ఇప్పించాలని సవాల్ చేశారు. ప్రతీ అక్కౌంట్ లో15 లక్షలు వేస్తామన్నారు. నీకు చైతనైతే 15 లక్షలు వేయించు చూద్దామని ఈటలకు సవాల్ చేశారు. ప్రజలకు, రైతులకు అన్యాయం జరిగినా పర్వాలేదా..నువు మాత్రం బాగుండాలా అని ఈటలను ప్రశ్నించారు. ఈటల  సిలిండర్ ధర తగ్గిస్తారా, పెట్రోల్ డిజీల్ ధర తగ్గిస్తారా అని ప్రశ్నించారు.  

Also Read : తెలంగాణలోనూ ప్రభుత్వ మటన్ మార్టులు.. హోల్ సేల్ అండ్ రీటైల్ !

రెడ్డి సోదరుల్లో సొంత స్థలం ఉన్న పేదవారికి ఇల్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని హరీష్ హామీ ఇచ్చారు. ఏడేళ్లు మంత్రిగా ఉండి హుజూరాబాద్ లో ఒక్క పేదవాడికి ఇళ్లు ఇవ్వని ఈటల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హుజూరాబాద్ ప్రజలను ఈటల మోసం చేయలేరన్నారు. తాను హుజురాబాద్ ప్రజలకు ఐదు వేల ఇళ్లు మంజూరు చేయిస్తానని ప్రకటించారు.  భవిష్యత్తులో సీఎంగారి ఆశీస్సులతో రెడ్డి కార్పోరేషన్ సాధించుకుందామని హామీ ఇచ్చారు. 

Also Read : ఏ పథకానికీ లేని చట్టబద్ధత ‘దళిత బంధు’కు ఎందుకు? గతంలో చట్టబద్ధత కల్పించిన "బంగారు తల్లి" ఏమయింది ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: telangana huzurabad harish rao reddy corporation etala rajendar

సంబంధిత కథనాలు

Breaking News Live: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగుబాటు

Breaking News Live: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగుబాటు

Drugs In Telagnana: ఎంతటివారైనా ఉపేక్షించవద్దు.. డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక సెల్: సీఎం కేసీఆర్

Drugs In Telagnana: ఎంతటివారైనా ఉపేక్షించవద్దు.. డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక సెల్: సీఎం కేసీఆర్

Hidma : హిడ్మా కోసం అడవుల్ని జల్లెడ పడుతున్న బలగాలు ! ఆచూకీ కనిపెట్టారా ?

Hidma :  హిడ్మా కోసం అడవుల్ని జల్లెడ పడుతున్న బలగాలు !  ఆచూకీ కనిపెట్టారా ?

YS Sharmila: నాతో రండి.. సమస్యల్లేకపోతే ముక్కు నేలకు రాస్తా, ఏడేళ్లుగా కేసీఆర్‌ను ప్రశ్నించే మగాడే లేడు: షర్మిల

YS Sharmila: నాతో రండి.. సమస్యల్లేకపోతే ముక్కు నేలకు రాస్తా, ఏడేళ్లుగా కేసీఆర్‌ను ప్రశ్నించే మగాడే లేడు: షర్మిల

Bandi Sanjay: కేసీఆర్ యాదాద్రి వద్ద తేల్చుకుందాం రా.. అది నిరూపిస్తే దేనికైనా సిద్ధం

Bandi Sanjay: కేసీఆర్ యాదాద్రి వద్ద తేల్చుకుందాం రా.. అది నిరూపిస్తే దేనికైనా సిద్ధం
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Pradhan Mantri Garib Kalyan Package: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం

Pradhan Mantri Garib Kalyan Package: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం

Putin on Covid19: అయ్యయ్యో వద్దమ్మా.. ఆఫీసుకు రావొద్దు.. కానీ జీతం మాత్రం ఇస్తాం.. సుఖీభవ!

Putin on Covid19: అయ్యయ్యో వద్దమ్మా.. ఆఫీసుకు రావొద్దు.. కానీ జీతం మాత్రం ఇస్తాం.. సుఖీభవ!

Taliban Crisis: తాలిబన్లా.. నరరూప రాక్షసులా! వాలీబాల్ క్రీడాకారిణి తలనరికి..

Taliban Crisis: తాలిబన్లా.. నరరూప రాక్షసులా! వాలీబాల్ క్రీడాకారిణి తలనరికి..

YSRCP : రెండు రోజులు వైఎస్ఆర్‌సీపీ జనాగ్రహ దీక్షలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నిరసనలు !

YSRCP :  రెండు రోజులు వైఎస్ఆర్‌సీపీ జనాగ్రహ దీక్షలు.. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని నిరసనలు !